ETV Bharat / state

అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ - CRDA Issued Gazette

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 5:51 PM IST

Government Complex Buildings in Amaravati: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది.

crda_issued_gazette
crda_issued_gazette (ETV Bharat)

Government Complex Buildings in Amaravati: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ (Capital Region Development Authority) గెజిట్‌ జారీ చేసింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 15 వందల 75 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 39 ప్రకారం CRDA కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఈ మేరకు బహిరంగ ప్రకటన జారీ చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ అయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.