ETV Bharat / state

తాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం- ఇంకా ఎంతమందిని బలిగొంటారు?: సీపీఎం - water problem in vijayawada - WATER PROBLEM IN VIJAYAWADA

CPM Leaders Protest Supply of Polluted Water in Vijayawada : విజయవాడలో కలుషితనీటి సరఫరాపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరవాసులకు స్వచ్ఛమైన నీరు అందించాలని ఆందోళన చేశారు. ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలపాలని డిమాండ్​ చేశారు.

cpm_leaders_protest
cpm_leaders_protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 1:21 PM IST

CPM Leaders Protest Supply of Polluted Water in Vijayawada : విజయవాడ నగర నడిబొడ్డు పశ్చిమ నియోజకవర్గం కొండప్రాంతాలలో కలుషిత నీరు సరఫరా చేయడం దారుణమని సీపీఎం నగర కార్యదర్శి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపాలెం గట్టు ప్రాంతంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. అధికారులు వెంటనే మంచినీటి పైప్ లైన్ లను మరమ్మతు చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలని డిమాండ్​ చేశారు.

Contaminated Drinking Water : కృష్ణమ్మ చెంతనే ఉన్న నగరవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని సత్యబాబు పేర్కొన్నారు. కృష్ణానది నీరు అంటేనే రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరవాసుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయని ఆరోపించారు. మొగల్రాజపురంలో ఇప్పటికే నలుగురు మరణించిన విషయాన్ని తెలియజేశారు. వాంతులు, వీరేచనాలతో వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారని పేర్కొన్నారు.

జలమా! హాలాహలమా? - ప్రజల ప్రాణాలను కాటేస్తున్న కలుషిత నీరు - Contaminated Drinking Water

Officers Neglect Drinking Water Supply : నగరంలో సామాన్యులపై చెత్త పన్నులు, ఇతర పన్ను భారాలు మోపే నగర పాలక సంస్థ అధికారులు వారికి స్వచ్ఛమైన నీరు ఇవ్వటానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలపాలని సత్యబాబు డిమాండ్​ చేశారు. నగరంలోని మొగల్రాజపురంలో కలుషిత నీటిని తాగి పలువురు మృతి చెందినా మునిసిపల్​ కార్పొరేషన్​ అధికారులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో కలుషిత తాగునీటిని సరఫరా చేయటం దారుణమని వాపోయారు.

తుప్పుపట్టిన పైపులైన్లు, రంగుమారిన నీరు- కలుషిత జలాలతో పేదల ప్రాణాలు గాలిలో! - DRINKING WATER PROBLEM

తాగునీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం- ఇంకా ఎంతమందిని బలిగొంటారు?: సీపీఎం (ETV Bharat)

నెల రోజుల నుంచి రంగు మారిన కలుషిత నీరును సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సత్యబాబు వాపోయారు. ఈ విషయంపై నగర మున్సిపల్​ కమిషనర్​, అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కోల్పోతేనే అధికారులు స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని గొల్లపాలెం గట్టు, కొండ ప్రాంతాల్లో పైపులైన్లు మరమ్మతు చేపట్టాలని సత్యబాబు కోరుకున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఆదోనిలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత- ఒకరి పరిస్థితి విషమం - Drinking Contaminated Water

" విజయవాడ నగరవాసులకు స్వచ్చమైనా నీరు ఇవ్వాలి. అధికారులు ఇప్పటికైనా రంగుమారినా కలుషిత నీరు ఆపాలి. పైపులైన్లో ఏర్పడిన లీకేజీలను బాగు చేయాలి. ప్రజలకు స్వచ్చమైనా మంచినీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం"

- సత్యబాబు, సీపీఎం నగర కార్యదర్శి

తాగునీటి సమస్యపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు - నీటి నమూనాలో నైట్రేట్స్ గుర్తింపు - Mogalrajapuram Water Contamination

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.