CPI National Secretary Narayana reacted to Alliance Victory in AP : ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ కూటమి విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలనను తుంగలో తొక్కి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహలో ఉండి నేడు ఓటమి పాలయ్యాడని విమర్శించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ మూలంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సీట్లు వచ్చాయని తెలిపారు. అంతేగాని ఏపీలో కూటమి విజయానికి బీజేపీ ప్రభావం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడాలని నారాయణ సూచించారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు- సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది: చంద్రబాబు
జగన్ ఐదేళ్లు సంక్షేమ పథకాలు ఇచ్చి మళ్లీ ఈ ఎన్నికల్లో ఓట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితి ఏపీలో మళ్లీ రాకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఐక్యత లేకపోవటం వల్లే విజయం సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ వారు సొంత లాభాలు వదిలేసి ఏక పక్షంగా ఉండి ఉంటే విజయం సాధించేవారని అన్నారు. ఒక సీఎం ఎలా ఉండకూడదో జగన్ అలా ఉన్నాడని విమర్శలు గుప్పించారు. అందుకే ప్రజాక్షేత్రంలో ఆయన గెలవలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైఎస్సార్సీపీ కొట్టుకుపోయింది. ఝంఝూమారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నబోయింది. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 135 చోట్ల గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్నీ కైవసం చేసుకుంది. బీజేపీ 10 స్థానాలకుగాను 8 చోట్ల గెలిచింది. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో టీడీపీ ఒక చోటే ఓడిపోగా, జనసేన రెండు చోట్లా గెలిచింది. బిజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్లే గెలిచింది. వైసీపీ కేవలం 11 శాసనసభ, 4 లోక్‌సభ సీట్లకు పరిమితమైంది.
కూటమి జైత్రయాత్ర - 10 సీట్లకే పరిమితమైన వైఎస్సార్సీపీ! - TDP clean sweep
అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమతమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ‘వైనాట్ కుప్పం’ అన్న జగన్‌కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30 వేలకుపైగా మెజార్టీ తగ్గింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో రెండు విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసినవారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. జగన్ కేబినెట్‌లో ఐదేళ్లూ మంత్రిగా ఉండి చివరి నిమిషంలో టీడీపీలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. కూటమి అభ్యర్థులకు చాలాచోట్ల అసాధారణ మెజార్టీలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో 30 వేలకుపైగా మెజార్టీ సాధించిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు.
పసుపు దళానికి అతడే ఒకసైన్యం - రాజకీయచాణక్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రుడు