Focus on Control Ganja in Vijayawada : రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తుని వదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సీపీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని నియమించారు.
Ganja Control in AP : ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు విజయవాడ కేంద్రంగా స్మగ్లర్లు సరఫరా చేస్తున్నారు. మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు పలువురు స్వయంగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు కిలోల వరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని బైక్‌లపై తీసుకొస్తున్నారు. వాటిని చిన్న పొట్లాలుగా చేసి ఒక్కొక్కటి 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేజీ 5 వేల నుంచి 8 వేల వరకు కొనుగోలు చేసి ఇక్కడ 20 వేల చొప్పున అమ్ముతున్నారు. దీంతో నగరంలోనూ గంజాయి సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. గంజాయి సరఫరాను నియంత్రించేందుకు విజయవాడ సీపీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు.
మాదకద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని మారుస్తాం : హోం మంత్రి అనిత - Home Minister In Anti Drug Day
ఏసీబీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం : కమిషనరేట్ స్థాయిలో ఏసీబీ ఆధ్వర్యంలో 12 మంది టాస్క్‌ఫోర్స్ సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ రామకృష్ణ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌కు తోడ్పాటు అందించేందుకు జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారముంటే టోల్ ఫ్రీ నెంబర్ 91211 62475, మెయిల్ ఐడీ: antinarcoticcell@vza.appolice.gov.in కి ఫిర్యాదు చేయాలని సీపీ రామకృష్ణ తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని గంజాయిని నియంత్రిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
"ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి నియంత్రణ చేయడానిక గత నెల నుంచి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఒక్కొ నెలల్లోనే 20 కేసులు పెట్టి 70 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా మంది ముద్దాయిలు విశాఖ, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో పండిన గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లయ్ చేస్తున్నారు. విజయవాడలో గంజాయిని నియంత్రించాడనికి 12 మంది కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం"- రామకృష్ణ, విజయవాడ సీపీ