Couple Committed Suicide: కృష్ణా జిల్లా గుడివాడ వాసవి నగర్లో విషాదం చోటు చేసుకుంది. 5 వందల కోసం దంపతుల మధ్య వివాదం తలెత్తి భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త కొలుసు రాంబాబు(45), బార్య కనకదుర్గ (40) మృతి చెందారు. స్వల్ప విషయానికే భార్యాభర్తలు మరణించడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో వాసవి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొలుసు రాంబాబు, భార్య కనకదుర్గ కుటుంబ సభ్యులతో కలిసి వాసవి నగర్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన రాంబాబు పలుచోట్ల ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
మద్యానికి 5 వందలు కావాలని భార్యను అడగగా తన దగ్గర లేవని చెప్పడంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన రాంబాబు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి మరణించిన విషయాన్ని తల్లి కనకదుర్గకు కుమారుడు ఫోన్ చేసి చెప్పాడు. మనస్థాపానికి గురైన కనకదుర్గ ఇంట్లోనే ఉరి వేసికొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి కనకదుర్గ ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రోజూ కళ్ల ముందు తిరిగాడే దంపతులు ఇద్దరూ మరణించడంతో వాసవి నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
Youth Suicide due to Loan App Harassment: లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రొంపిచర్ల మండలం పరగటిచర్లకు చెందిన గుడిపూడి శ్యాం ప్రసాద్ కుమారుడు విజ్ఞేష్ (22) అనే ప్రయివేటు కళాశాలలో చదువుతున్నాడు.
అయితే అతను తన ఫోన్లోని ఓ రుణ యాప్ ద్వారా నగదు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేకపోవడంతో రుణ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. వారి బెదిరింపులు తాళలేక సెలవులకు ఇంటికి వచ్చిన విజ్ఞేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు వివరించారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన విజ్ఞేష్ తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రొంపిచర్ల పోలీసులు విజ్ఞేష్ ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని తండ్రి శ్యాం ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.