Contract Electricity Workers Demand to Fulfill Jagan Promises : జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. హామీ ప్రకారం ఉద్యోగ భద్రత , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. దీనిపై విజయవాడ ప్రెస్ క్లబ్‌లో APVTUSC వారు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయలేదని APVTUSC ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి ధ్వజమెత్తారు. సమస్యలను పరిస్కరించపోతే ఫిబ్రవరి 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
చర్చలు విఫలం.. 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిస్కరించపోతే ఫిబ్రవరి రెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి .సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రంగంలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగా భధ్రత కల్పిస్తానని ఇచ్చిన హామీని నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు.
విద్యుత్ కనెక్షన్లలో స్మార్ట్‌గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్ కొట్టేయ్
Concerns of Electricity Workers in AP : మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ ఏందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం లేదని విమర్శించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ యాజమాన్యాలే కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. దీని ఫలితంగా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సూపర్వైజర్ చార్జ్స్ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లించే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. ఎటువంటి ఆర్థిక భారం కానటువంటి ఈ డైరెక్టు వేతనం చెల్లింపు విధానాన్ని సైతం ప్రభుత్వం అమలు చేయటం లేదని మండిపడ్డారు.
కరెంటు లేకపోతే గొడవ చేస్తారు - ఇస్తే బిల్లు ఎక్కువ వస్తుందంటారు ఎలా? : వైసీపీ ఎమ్మెల్యే ఉచిత సలహా!
ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను ఇచ్చిన హమీలు మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని వేచిచూశామని తెలిపారు. కానీ ఆ హామీని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయాత్నం చేయటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.