ETV Bharat / state

థియేటర్లో అసౌకర్యంపై ఫిర్యాదు - ముక్త ఏ2 సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ జరిమానా - Consumer Commission Mukta A2

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 2:50 PM IST

No AC in Mukta A2 Theater Case : ఓ వ్యక్తి ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. చిత్రం ప్రారంభమైన తర్వాత థియేటర్‌లో ఏసీ రాకపోవడంతో ఆసౌకర్యానికి లోనయ్యాడు. దీనిపై అతను యజమాన్యాన్ని ప్రశ్నించగా స్పందిచగపోగా, అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించగా, విచారణ చేపట్టిన కమిషన్​ ఫిర్యాదుదారుడికి టికెట్ డబ్బుల రిఫండ్‌తో పాటు, వేదనకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Hyd Consumer Commission2 Fined Mukta A2 Cinemas

Hyd Consumer Commission2 Fined Mukta A2 Cinemas : చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్తుంటారు. అక్కడ చిత్రాలను వీక్షిస్తూ ఆనందాన్ని పొందుతారు. కానీ ఒక్కోసారి కొన్ని థియేటర్లలో సౌకర్యాల లేమి ఇబ్బందులకు గురి చేస్తాయి. కొందరు ఇక తప్పదని అడ్జస్ట్ అవుతూ సినిమాను చూస్తున్నారు. మరికొందరు వాటిని ప్రశ్నిస్తారు. అంతటితో ఆగకుండా తమకు కలిగిన అసౌకర్యంపై పోరాటం చేస్తుంటారు. తాజాగా వినియోగదారుల కమిషన్ వెలువరించిన తీర్పే ఇందుకు నిదర్శనం.

Consumer Commission in Telangana : ప్రేక్షకుడు హాయిగా సినిమాను చూసే వాతావరణం కల్పించకుండా ఇబ్బందికి గురిచేసిన ముక్త ఏ2 సినిమాస్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేయడంతో పాటు ఫిర్యాదిదారు వేదనకు పరిహారంగా రూ.3,000లు, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1000 చెల్లించాలని ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతం ఆనంద్‌నగర్‌కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చింది.

నేరోళ్ల నిష్పర్‌ కిసీ కా భాయ్‌ - కిసీ కా జాన్‌ సినిమా చూసేందుకు 2023 ఏప్రిల్‌ 28న అబిడ్స్‌లోని ముక్త ఏ2 సినిమాస్‌ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన ద్విచక్రవాహనాన్ని పార్క్‌ చేసినందుకు రూ.20 రుసుము, సినిమా టికెట్‌ కోసం రూ.150 చెల్లించారు. సినిమా ప్రారంభమైనా థియేటర్‌లో ఏసీ పనిచేయకపోవడం, ఏర్పాటు చేసిన కొన్ని ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వస్తుండటంతో నేరోళ్ల నిష్పర్‌ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఎయిర్‌ ఇండియాకు వినియోగదారుల కమిషన్‌ షాక్.. ప్రయాణం రద్దయితే పరిహారం ఇవ్వాల్సిందే!

ఇంటర్వెల్‌ సమయంలో దీనిపై యాజమాన్యాన్ని నేరోళ్ల నిష్పర్‌ ప్రశ్నించినా సరిగా స్పందించలేదు. పైగా అక్కడి సిబ్బంది ఆయనను దుర్భాషలాడటంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. గోల్డ్‌ క్లాస్‌ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ సినిమాస్‌(రెగ్యులేషన్‌) చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్‌ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న ప్రతివాద థియేటర్‌ యాజమాన్యం ఫిర్యాదుదారు ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. ఇరువైపులా వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కమిషన్‌-2 నిష్పర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ అమలుకు 45 రోజుల గడువు విధించింది.

ఎయిర్ లైన్స్​ సేవాలోపంపై డీజీపీ ఫిర్యాదు - రూ.2లక్షల ఫైన్ వేసిన వినియోగదారుల కమిషన్ - Consumer Commission Imposed Fine

Consumer Win 16 Year of Land Case in Hyderabad : స్థలం అభివృద్ధి చేస్తామని మోసం.. 16 ఏళ్ల తర్వాత తీర్పు చెప్పిన వినియోదారుల కమిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.