ETV Bharat / state

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్ అప్పుడే! - Abhishek Singhvi Nomination Date - ABHISHEK SINGHVI NOMINATION DATE

Abhishek Singhvi Nomination Date : రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన నేపథ్యంలో ఈనెల 19న ఆయన నామినేషన్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 18న పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న సమావేశంలో అభిషేక్ సింఘ్వీని పార్టీ ఎమ్మెల్యేలకు పరిచయం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Abhishek Singhvi Nomination Date
Abhishek Singhvi Nomination Date (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 4:04 PM IST

Abhishek Singhvi Nomination Date : తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేస్తున్న అభిషేక్ మను సింఘ్వీ ఈ నెల 19న నామినేషన్ వేసే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసి ప్రకటించింది. ఇవాళ దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అభిషేక్ మను సింఘ్వి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ నెల 18న సీఎల్పీ సమావేశం! : ఈ నెల 18వ తేదీన పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ ప్రైవేటు హోటల్​లో సీఎల్పీ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ సమావేశం రోజు అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పరిచయం చేయడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సింఘ్వీ ఒక్కరే నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. కానీ కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కావడంతో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆయన కలుసుకున్నారు. ఆయనతో వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ పెద్దలు, పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తున్న అభిషేక్ సింఘ్వి విషయంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై హైకమాండ్​తో సీఎం చర్చించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిని ఫాక్స్​కాన్ ఛైర్మన్ యంగ్ లి యూ కలుసుకున్నారు. త్వరలో హైదరాబాద్​ను సందర్శిస్తామని వెల్లడించారు. పరిశ్రమలు, సేవారంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్​కు ఉందని కొనియాడారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ - Abhishek Singhvi Contest Rajyasabha

ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాం - కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ - CM REVANTH ON TG CABINET EXPANTION

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.