ETV Bharat / state

రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి బాధ్యతలు

Congress Chinna Reddy Latest News : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభవన్​లో పూజలు చేసిన చిన్నారెడ్డి అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కేసీఆర్  భంగం చేశారని మండిపడ్డారు.

Congress Chinna Reddy Latest News
Congress Chinna Reddy Latest News
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 12:18 PM IST

Updated : Feb 29, 2024, 12:47 PM IST

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి బాధ్యతలు

Congress Chinna Reddy Latest News : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడక ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మరిచిపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మన్‌ చిన్నారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

TS Planning Board Vice Chairman Chinna Reddy : ప్రజాభవన్​లో పూజలు చేసిన చిన్నారెడ్డి అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాక ముందే 4 పథకాలను అమలు చేశామని తెలిపారు. ప్రణాళిక బోర్డు రాష్ట్రంలో ముఖ్యమైన విభాగమని వెల్లడించారు. తెలంగాణ స్వరాష్ట్రం బిల్లు ఏకగ్రీవంగా పార్లమెంటులో ఆమోదింపజేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి

"ఆనాడు కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇలాగే భంగం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. రైతు బంధు వంటి పథకాల వల్ల కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది." - చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో ప్రజలంతా కళ్లారా చూస్తున్నారని చిన్నారెడ్డి (TS Planning Board Chinna Reddy) అన్నారు. డ్యామ్ మొత్తం కూలిపోయే స్థితిలో ఉందని తెలిపారు. మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ, ఇలా దాదాపు అన్ని పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు చాలా మంది చేతివాటం చూపించారన్న చిన్నారెడ్డి, కృష్ణా గోదావరి నదుల్లో (Krishna Water Dispute) తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పూర్తిస్థాయిలో రావడం లేదని పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదనలో ఉండి ఆచరణలకు నోచుకోని ఎన్నో పథకాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు.

"ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు (BRS Kaleshwaram Tour) సందర్శనకు వెళ్తున్నారు. మావల్ల తప్పయింది క్షమించండి అని వాళ్లు ప్రజలను క్షమాపణ కోరాలి. తెలంగాణ ఏర్పడిన రోజున రాష్ట్రంపై రూ.70 వేల కోట్ల అప్పు ఉంది. గత పదేళ్లలో కేసీఆర్ వల్ల ఆ అప్పు పదింతలయింది. దేశంలోనూ మోదీ సర్కార్ వల్ల అప్పు మూడింతలు పెరిగింది. రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. కేసీఆర్ రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితికి తీసుకువచ్చారు. మరోవైపు నియామకాల్లోనూ నిరుద్యోగులకు అన్యాయమే జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇంకా ఉద్యోగ భర్తీలు చేయడంపై కసరత్తు చేస్తోంది." అని చిన్నారెడ్డి అన్నారు.

ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు: చిన్నారెడ్డి

కేసీఆర్ పోటీ చేసినా ఓటమి తప్పదు: చిన్నారెడ్డి

Last Updated : Feb 29, 2024, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.