Congress Announced Telangana Rajya Sabha Candidates : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు పేర్లను ఖరారు చేస్తున్నట్లు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే కర్ణాటక నుంచి సైతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అశోక్‌సింగ్ పేరు ఏఐసీసీ ఖరారు చేసింది. రాజ్యసభకు ఎంపిక చేయడంపై అనిల్‌కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయని చెప్పడానికి తానే నిదర్శనమన్నారు.
నా లాంటి యువకులకు అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. నాకు పదవి ఇవ్వడం యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమే. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యం. ఎమ్మెల్సీగా బలమూరి వెంకట్‌కు, నాకు రాజ్యసభ ఇవ్వడంతో, కాంగ్రెస్ యువకులకు ఇస్తున్న ప్రాధాన్యత అర్ధం చేసుకోవచ్చు. - అనిల్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు
Rajya Sabha Elections 2024 Schedule : రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలయింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్య సభ సభ్యుల ఎన్నికకు(Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్‌ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
Rajya Sabha Seats In Telangana : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు(Congress) సంఖ్యాపరంగా 64 మంది, మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, బీఆర్ఎస్ 39, బీజేపీ(BJP) 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది. నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్లతో పాటు అదనంగా మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండో స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు.
కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్ రెడ్డి
సాగు భూమికే రైతు భరోసా! - వ్యవసాయ రుణమాఫీపై త్వరలోనే నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి