ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్​లో కాకరేపుతున్న వెంకటేశ్​ నేత చేరిక - మొదలైన గ్రూపు రాజకీయాలు - ఆదిలాబాద్​ కాంగ్రెస్​లో విభేదాలు

Conflict Between Adilabad Congress Leaders : కాంగ్రెస్​ పార్టీలో బీఆర్​ఎస్​ నేతల చేరికలు అంతర్గతంగా కుంపటిని రాజేస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత హస్తం పార్టీలో చేరడంతో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో అసమ్మతి రాజుకుంది. ఇప్పుడు అక్కడు మూడో గ్రూపు సిద్ధమై, పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్​కు నష్టం చేకూర్చే విధంగా మారింది.

Conflict Between Adilabad Congress
Conflict Between Adilabad Congress Leaders
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 8:31 PM IST

Conflict Between Adilabad Congress Leaders : ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా కాంగ్రెస్​లో అంతర్గత ముసలం కొనసాగుతోంది. బీఆర్​ఎస్​కు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత(MP Venkatesh Netha)ను చేర్చుకోవడంతో హస్తం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ టికెట్​ను తన కుమారుడు వంశీకి ఇప్పించేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సోదరులు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​ సాగర్​రావు మధ్య పొసగడం లేదు. రేవంత్​ రెడ్డి మంత్రిమండలిలో స్థానం కోసం ఎవరికి వారు అంతర్గత ప్రయత్నాలు చేస్తుంటే పెద్దపల్లి ఎంపీ ఎంకటేశ్​ నేత చేరికతో మూడో గ్రూపుగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ను పార్టీలో చేరిక సమాచారం ఇవ్వకపోవడం కాంగ్రెస్(Congress)​లో అసంతృప్తికి దారితీస్తోంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రేమ్​ సాగర్​ రావు, వివేక్​, వినోద్​ సోదరులకు కనీసం మాట వరుసకైనా సంప్రదించకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

చెన్నూరు నియోజకవర్గం నుంచి 2018లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేశ్​ ఆ తర్వాత బీఆర్​ఎస్​లో చేరి 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల వరకు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా పని చేసిన ఆయనను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమేంటని హస్తం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలిచేనా!

Adilabad Congress Disagreement : తొలుత బీజేపీలో చేరాలనుకున్న వెంకటేశ్​ నేత, చివరికీ సహచర ఎంపీగా సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy)తో ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్​లో చేరారనే ప్రచారం సాగుతోంది. బాల్క సుమన్​తో బీఆర్​ఎస్​లోనూ కొంతకాలంగా వెంకటేశ్​కు సఖ్యత లేదని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనను కాంగ్రెస్​లో చేర్చుకోవడం ద్వారా గులాబీ దళంలో ఉన్న అసంతృప్తిని తగ్గించినట్లవుతుందనే అభిప్రాయం హస్తం పార్టీలో గూడుకట్టుకుంటోందని సమాచారం.

పెద్దపల్లి పార్లమెంటు స్థానం టికెట్​ ఎవరికి ఖరారవుతుందో ఇప్పటికిప్పుడే వెల్లడికాకపోయినా వెంకటేశ్​ నేత చేరికతో ఆదిలాబాద్​ జిల్లా కాంగ్రెస్​లో అసమ్మతిని రాజేసింది. ఇదే సమయంలో బీఆర్​ఎస్​లో నెలకొన్న గ్రూపు విభేదాలను బహిర్గతం చేసినట్లయింది. ఈ నెల ఆరో తేదీన బీఆర్​ఎస్​ ఎంపీ వెంకటేశ్​ నేత దిల్లీలో కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆయన చేరికతో బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ తగిలినట్లు అయింది.

బీఆర్ఎస్​కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్‌ నేత

చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్​'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.