ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతలు భూకబ్జాలు చేశారు - మంత్రి సవితకు బాధితుల ఫిర్యాదు - Minister Savita Grievance - MINISTER SAVITA GRIEVANCE

Minister Savita Grievance at NTR Bhavan : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్​ భవన్​లో నిర్వహించిన కార్యరక్రమానికి ప్రజలు తరలి వచ్చారు. మంత్రి సవిత సహా పలువురు అధికారులు బాధితుల వినతులు స్వీకరించారు.

minister_savita_grievance_at_ntr_bhavan
minister_savita_grievance_at_ntr_bhavan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 9:18 AM IST

Minister Savita in Public Grievance at NTR Bhavan : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎదో ఒక విధంగా ఇబ్బందులకు గురయ్యారన్న సంగతి తెలిసిందే. విచిత్రమేంటంటే సాయం చెయ్యాల్సిన నాయకులే అధికారం అండతో దోపిడీలు, అక్రమాలకు పాల్పడి సామాన్యులను ముప్పతిప్పలు పెట్టారు. నేడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సవరిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు చేస్తున్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాధితుల నుంచి మంత్రి సవిత వినతులు స్వీకరించారు. వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలో రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని, కొత్త వాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల క్రితం విద్యుదాఘాతానికి గురై చేతులు కోల్పో్యానని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాపట్ల జిల్లా తాడివారిపాలెంకు చెందిన నాగరాజు కోరారు.

సామాన్యుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ ​- రాష్ట్ర వ్యాప్తంగా రాక - Nara Lokesh Praja Darbar

గుంటూరు లాలాపేటకులో ఉన్న పెద్ద మసీదుకు చెందిన 187 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని కరీమ్​ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా సుమారు 1100 మంది విద్యార్థులకు విద్యా దీవెన నిధులు రావాల్సి ఉందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగంలో డీఆర్​పీ లుగా పని చేస్తున్న తమను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్​ కుమార్​ బంధువు, అప్పటి డైరెక్టర్​ జగదీశ్​ అన్యాయంగా తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని పలువురు బాధితులు కోరారు. సీసీ రహదారుల బిల్లులు నేటికీ మంజూరు కాలేదని కాంట్రాకర్లు వినతిపత్రం అందజేశారు.

మరో వైపు మంత్రి నారా లోకేశ్​ చేపట్టిన ప్రజా దర్బార్​ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేశ్​ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలు పెట్టిన ప్రజాదర్బార్​ బాధితలకు ఊరట కలిగిస్తుంది.

Spandana Program: జగనన్నకు చెప్పినా కానరాని స్పందన.. పదే పదే మొరపెట్టుకున్నా ప్రతిఫలం లేదని ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.