ETV Bharat / state

మేడారం వెళ్లే భక్తులకు 'టోల్ ​గేట్​' కష్టాలు - పర్యావరణ రుసుం నిలిపివేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటన - Konda Surekha on Medaram Toll Plaza

Collecting More Money at Medaram Jatara Toll Plaza : మేడారం జాతర సమీపిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. అయితే, వన దేవతల ఆశీస్సులు పొందాలంటే భక్తుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. టోల్‌తో పాటు, పర్యావరణ, పార్కింగ్‌ ఛార్జీల పేరుతో రుసుముల భారం పడుతోంది. 45 కిలోమీటర్ల పరిధిలోనే మూడుచోట్ల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందన్న భక్తుల ఆందోళనపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. జాతర ముగిసే వరకు పర్యావరణ ఛార్జీల వసూలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Minister Konda Surekha on Medaram Toll Plaza
Collecting More Money at Medaram Jatara Toll Plaza
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 8:03 PM IST

Collecting More Money at Medaram Jatara Toll Plaza : ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం మహా జాతర మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తుగా మొ‌క్కులు చెల్లించుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల ద్వారా జాతరకు వచ్చే భక్తులకు టోల్‌గేట్‌ కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు నాలుగు టోల్‌ గేట్లు దాటాల్సి వస్తోంది. మరోవైపు వాహనాల రద్దీ మూలంగా ట్రాఫిక్‌ సమస్యలు సైతం వస్తూనే ఉన్నాయి.

Telangana Medaram Jatara 2024 : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు కనీసం రూ.550 టోల్‌ ఛార్జీలు పడుతున్నాయి. యాదాద్రి జిల్లా గూడూరు, జనగామ జిల్లా కోమల్ల, హనుమకొండ జిల్లా కోమటిపల్లి, ములుగు జిల్లా జవహర్​నగర్‌ వద్ద టోల్‌గేట్లలో వాహనాల స్థాయిని బట్టి రూ.2 వందల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలోని పస్రా, ఏటూరు నాగారం, తాడ్వాయిలలో అటవీ శాఖ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణ ఛార్జీల పేరుతో భారీ వాహనాలకు రూ.2 వందలు, లైట్‌ మోటారు వాహనాలకు రూ.50ల చొప్పున తీసుకుని రశీదు అందిస్తున్నారు. ఇక మేడారంలోని పంచాయతీ సిబ్బంది పార్కింగ్‌ రుసుమలు వసూలు చేస్తున్నారు. మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని అదనపు భారం తగ్గించాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాబోయ్ ఇదేం బాదుడు - మేడారం వెళ్లాలంటే ఇన్ని ఛార్జీలు కట్టాలా?

Minister Konda Surekha on Medaram Toll Plaza : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.ప్రభుత్వం సూచన మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఫిబ్రవరి 2నుంచి 29వరకు పర్యావరణ రుసుం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మేడారం సమక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - తల్లులకు ముందస్తు మొక్కులు

ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, పర్యావరణ రుసుం ద్వారా వచ్చే ఆదాయాన్ని వన్యప్రాణుల రక్షణ, ప్లాస్టిక్‌ తొలగించేందుకు అటవీ శాఖ వినియోగిస్తోంది. మేడారం జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని సూచించారు.

మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి

జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.