CM Revanth America Tour For Investments : అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. న్యూ జెర్సీలో ప్రవాస తెలుగు ప్రజలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కోరారు. తమ పాలనపై అపోహలు వద్దన్న రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను ప్రపంచంలో అగ్రశ్రేణిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్‌సిటీ నిర్మించేందుకు ప్రణాళికలుచేస్తున్నట్టు వివరించారు.
రాష్ట్రాన్ని మెట్రోకోర్ అర్బన్, సబర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలు నెలకొల్పుతున్నామని చెప్పారు పుట్టిన దేశం, రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే లాభాలతో పాటు సంతృప్తి ఉంటుందంటూ ఎన్నారైలను ప్రోత్సహించారు. స్కిల్ యూనివర్సిటీ నెలకొలుపుతున్నామని వివరించిన రేవంత్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా ఉండబోతున్నట్లు వెల్లడించారు.
Cognizant New Centre in Hyderabad : ప్రముఖ ఐటీసంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో కేంద్రం నెలకొల్పేందుకు కాగ్నిజెంట్ సంసిద్ధత వ్యక్తంచేసింది. కాగ్నిజెంట్ విస్తరణతో సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణినగరాలు, పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ నెలకొల్పాలని ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తుందని కాగ్నిజెంట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్‌లకు పెట్టుబడులు : అమెరికాకు చెందిన వాల్ష్‌కర్రాహోల్డింగ్స్ వీ- హబ్‌లో రూ. 42 కోట్ల పెట్టుబడి పెట్టేందుకి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంచేసుకుంది. రాబోయే ఐదేళ్లలో వీ-హబ్‌తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్‌లలో దాదాపు రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ వీ-హబ్ సీఈవో సీతా ఒప్పందంపై సంతకం చేశారు. పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని అభిప్రాయపడ్డారు.
దక్షిణ కొరియాలో పర్యటించనున్న సీఎం బృందం : పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌ని సందర్శించారు. ఈనెల 10 వరకు అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది. నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎంతో కలిసి ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధుల భేటీలో పాల్గొననున్నారు. రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ సంస్థ సీఈవోతో ఈనెల 12న కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఎస్ ఎల్బీసీ టన్నెల్ కోసం అధునాతన యంత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించనున్నారు. ఈనెల 11 నుంచి 13 వరకు రేవంత్ బృందం దక్షిణ కొరియాలో పర్యటించనుంది.
స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University