CM Revanth Visits Keeravani studio In Hyderabad : హైదరాబాద్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. 'జయజయహే తెలంగాణ' గేయాన్ని స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నందున అందుకు సంబంధించి ప్రముఖ కవి అందెశ్రీ, సంగీత దర్శకులు ఎంఎం.కీరవాణితో చర్చించేందుకు స్టూడియోకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతోపాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి అన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
CM Revanth Focus On Jaya Jayahe Song : తన సలహాదారుడు వేంనరేంద్ర రెడ్డితో కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పాటను ఒకటికి రెండు సార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో గతంలో పది జిల్లాలు అన్న పదాన్నితొలిగించినట్లు సమాచారం. ఆ స్థానంలో 'పద పద' అన్నపదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి 'జయజయహే'అన్న తెలంగాణ గేయం భవిష్యత్తులో ఏలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేట్లు ప్రస్తుతం ఉన్న గేయాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఈ గేయం అన్ని అంశాలతో మొత్తం నిడివి 13 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని తక్కువ సమయంలో వాడుకునేందుకు రెండు నుంచి మూడు నిముషాలు నిడివి ఉండేట్లు అందులో ముఖ్యమైన అంశాలు ఉండేట్లు కూర్పు చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నాహకాలు : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలని నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈసీ అనుమతి కోసం ఎదురు చూసింది. అయితే ఈసీ అనుమతి ఇవ్వడంతో వేడుకల నిర్వహణకు మార్గం సుగమమైంది. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. రాష్ట్ర అధికార గీతంగా జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ గీతాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించనున్నారు. ఈ గేయం తెలంగాణ ఉద్యమ సమయంలో విస్తృత ప్రాచుర్యం పొందింది. మరోవైపు రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Decade Celebrations : పదేళ్ల ప్రగతిని చాటేలా.. అమరుల త్యాగాలను స్మరించుకునేలా..