ETV Bharat / state

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌ - congress

CM Revanth Serious on Power Connection Checkings : ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.

CM Revanth Fires on Electricity Dept
CM Revanth Serious on Power Connection Checkings
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 10:29 PM IST

Updated : Feb 1, 2024, 10:35 PM IST

CM Revanth Serious on Power Connection Checkings : ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Fires on Electricity Dept : ఇవాళ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల(Praja Palana) సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు..? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరని సమీక్షలో ఉన్న ట్రాన్స్ కో -సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అని ఆరా తీశారు.

సమావేశంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందించి, రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ జె. శ్రీనివాస రెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్.ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.

అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి

ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఈని అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి జరిగిన సంఘటనను సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు అధికారులు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి అధికారులకు హితవు పలికారు.

Govt Released Constituency Funds : అభివృద్ధి పనుల కోసం అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1190 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఇంచార్జి మంత్రుల ఆమోదంతోనే ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పది కోట్ల రూపాయల్లో 2 కోట్లను విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, కోటి రూపాయలను మంచినీటి సరఫరాకు, 50 లక్షల రూపాయలను కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో పనులకు ఉత్తర్వులు జారీ వీలైనంత త్వరగా చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది.

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం

Last Updated : Feb 1, 2024, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.