ETV Bharat / state

నిరుద్యోగులు డిమాండ్‌ - సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH LAUNCH BFSI COURSES - CM REVANTH LAUNCH BFSI COURSES

BFSI Courses Launches in Telangana : ప్రపంచపటంలో హైదరాబాద్​ను విశ్వనగరంగా నిలపటమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్​ఎస్​ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.

CM Revanth Reddy Launch BFSI Course Today
BFSI Courses Launches in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 3:04 PM IST

Updated : Sep 25, 2024, 6:19 PM IST

CM Revanth Reddy Launch BFSI Course Today : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనే పరమావధిగా ప్రభుత్వం రూపొందించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 38 డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగ సంస్థలకు అవసరమైన శిక్షణను బీఎఫ్ఎస్ఐ కోర్సు ద్వారా అందించనున్నారు.

బీఎఫ్ఎస్ఐ కన్షార్టియం, ఎక్విప్ సంస్థల సహకారంతో ఈ విద్యా సంవత్సరం నుంచే మొత్తం 10వేల మంది విద్యార్థులకు ఈ కోర్సును అందించనున్నారు. ఇక ఇందుకోసం అయ్యే ఖర్చు నిమిత్తం రూ.2.5 కోట్లను సీఎస్ఆర్ కింద ఎక్విప్ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది. కార్యక్రమంలో భాగంగా బీఎఫ్​ఎస్​ఐ స్కిల్ ప్రోగ్రాంకు సంబంధించిన వెబ్​సైట్​ను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించారు.

గత పదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు : ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరైన ఉపాధి మార్గాలు లేక యువత ఇటీవల డ్రగ్ పెడలర్స్​గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ , ఇంజినీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వటం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. ఉపాధి కల్పన కోసమే యువత తెలంగాణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ పదేళ్ల కాలంలో సమస్య మాత్రం పరిష్కారం కాలేదని మండిపడ్డారు.

నాలెడ్జ్‌, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం తెలిపారు. బీఎఫ్​ఎస్​ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు కోర్సు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్‌ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని సీఎం ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు.

"ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే నిరుద్యోగ యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా డిగ్రీ, బీటెక్‌ చదివినవారు కూడా డ్రగ్స్‌ విషవలయంలో చిక్కుకుంటున్నారు. డ్రగ్స్ వల్ల పంజాబ్‌లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మన రాష్ట్రంలో రానివ్వద్దంటే, అందరూ కలసికట్టుగా పనిచేయాలి."- రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తాం : తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న ముఖ్యమంత్రి, డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఏటా 3లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం, ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు వివరించారు. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని పరిశ్రమల యజమానులను అడుగుతున్నామని, అందుకు తగ్గట్టుగానే నిరుద్యోగ యువత డిమాండ్‌-సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలని రేవంత్‌రెడ్డి తెలిపారు.

డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలని కోరారు. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకోవడం లేదన్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగవకాశాలు ఉన్నాయని తెలిపారు. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలని ఉద్ఘాటించారు. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటేనే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, ఈ క్రమంలోనే బీటెక్‌ చదివిన వారు కూడా డ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టామన్న ఆయన, ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని అందరూ కలిస్తేనే డ్రగ్స్‌ నిర్మూలన సాధ్యమని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలన్న సీఎం, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని అన్నారు.

మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు - జీవో జారీ - CM Revanth Review On Musi River

రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డులు - త్వరలోనే పైలెట్ ప్రాజెక్ట్​ ప్రారంభం - CM REVANTH REVIEW MEET

Last Updated : Sep 25, 2024, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.