CM Revanth Reddy Speech in Tukkuguda : బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో, వందేళ్ల విధ్వంసం జరిగిందని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌కు కాలు విరిగిందని, కూతురు జైలుకెళ్లిందని తాము జాలి చూపించామన్నారు. ప్రభుత్వపై ఏం మాట్లాడినా ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఏం మాట్లాడినా చూస్తు ఊరుకోవడానికి తానేమీ జానారెడ్డిని కాదని, రేవంత్‌రెడ్డినని స్పష్టం చేశారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను చర్లపల్లి జైల్లో పెడతామని హెచ్చరించారు. కేసీఆర్‌కు జైల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎద్దేవా చేశారు.
పదవుల కోసం తమ్ముణ్ని చంపితే వైఎస్సార్ తట్టుకునేవారా?: సునీత
Congress Janajathara Sabha : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 9న దిల్లీలో మువ్వెన్నల జెండా ఎగరాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో, బీజేపీని అలాగే ఓడించాలని, కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. గుజరాత్ మోడల్‌పై, వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తోందని వెల్లడించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, మోదీ ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని దుయ్యబట్టారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారని గుర్తుచేశారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది చనిపోయారని, 750 మంది రైతులు చనిపోతే బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదని మండిపడ్డారు.
అన్నపై పోరుకు చెల్లెళ్లు 'సిద్ధం'!- నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
జరగబోయేది మోదీ పరివార్.. గాంధీ పరివార్‌ల మధ్య యుద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ పరివార్‌లో ఈవీఎంలు, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయని, గాంధీ పరివార్‌లో రాహుల్, ప్రియాంక, లక్షలాది కార్యకర్తలు ఉన్నారని ఆయన తెలిపారు. మోదీ పరివార్‌తో యుద్ధం చేసి తీరుతామని స్పష్టం చేశారు. దిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు కావాలంటే, 14 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు.
6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఉత్తర భారత్, దక్షిణ భారత్ అని బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించలేదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ విధానాలు, పథకాలు నచ్చితే 14 ఎంపీ సీట్లు ఇవ్వాలని, పాలన సరిగా లేకుంటే మాకు ఓటేయాలో లేదో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
"బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో, వందేళ్ల విధ్వంసం జరిగింది. కేసీఆర్‌కు కాలు విరిగిందని, కూతురు జైలుకెళ్లిందని జాలి చూపించాము. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేనేమి జానారెడ్డిని కాదు, రేవంత్‌రెడ్డిని. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను చర్లపల్లి జైల్లో పెడతాము. కేసీఆర్‌కు జైల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం - జగన్‌ను సాగనంపడమే లక్ష్యంగా ముందడుగు