ETV Bharat / state

మహబూబ్​నగర్​లో ఎలా ఓడిపోయాం? సమీక్షించనున్న సీఎం రేవంత్​ - CM Revanth Review on Mahabubnagar MP Results - CM REVANTH REVIEW ON MAHABUBNAGAR MP RESULTS

CM Revanth Review on Mahabubnagar : మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. కాంగ్రెస్​కు ఓట్లు తగ్గడంతో పాటు మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ రావడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

CM Revanth on Mahabubnagar Majority for Congress
CM Revanth Review on Mahabubnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 4:48 PM IST

Updated : Jun 6, 2024, 6:56 PM IST

CM Revanth on Mahabubnagar Majority for Congress : మహబూబ్​నగర్‌ పార్లమెంటు ఫలితాలపై ఆ నియోజకవర్గ నాయకులతో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష చేయనున్నారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మహబూబ్​నగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గెలవడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడంగల్‌, షాద్​నగర్‌, జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గాలల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఓట్లు వచ్చినప్పటికీ మిగిలిన నాలుగు నియోజకవర్గాలల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ అభ్యర్ధి డీకే ఆరుణ విజయం సాధించారు.

నియోజకవర్గాల వారీగా, బూత్​ల వారీగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు వచ్చిన ఓట్ల సంఖ్యను పరిశీలించినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్​కు ఓట్లు తగ్గడం, బీజేపీకి అధికంగా రావడం ఎలా సాధ్యమైందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాలపై త్వరలోనే సీఎం రేవంత్​ ఆ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించి ఎక్కడ తప్పిదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ టీడీపీ నాయకుడు చంద్రబాబుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు.

CM Revanth on Mahabubnagar MP Candidate Defeat : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సొంత జిల్లాకు చెందిన మహబూబ్​నగర్ లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి ఓటమిపాలయ్యారు. పైగా ఆ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వాళ్లే. కచ్చితంగా మహబూబ్​నగర్ లోక్​సభ స్థానం తమ పార్టీదేనని అంచనా వేసిన హస్తం నేతలు షాక్​కు గురయ్యారు. ఆ నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్​ నేతలను నిరాశ పరిచాయి.

కాంగ్రెస్​ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 4 వేల 500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఓటమిపై ప్రస్తుతం కాంగ్రెస్ సహా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మహబూబ్​నగర్​లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలు, నియోజకవర్గంలో కాంగ్రెస్​కు వచ్చిన ఓట్లు, బీజేపీకి దక్కిన మెజార్టీపై ఇలా పలు అంశాలపై ముఖ్యనేతలతో చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు మా ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచాయి : సీఎం రేవంత్‌ రెడ్డి - cm revanth REACTION

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి - చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ - cm revanth phone call to cbn

Last Updated : Jun 6, 2024, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.