ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం - జూన్​ 2న జాతికి అంకితం : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth review on TG Anthem - CM REVANTH REVIEW ON TG ANTHEM

CM Revanth Focus on New Telangana Anthem : జూన్‌ 2న జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కవి అందెశ్రీ, ఎం.ఎం. కీరవాణి, ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

CM Revanth Focus on New Telangana Anthem
CM Revanth Focus on New Telangana Anthem (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 5:30 PM IST

Updated : May 30, 2024, 7:41 PM IST

CM Revanth on New Telangana Anthem : తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. జూన్‌ 2న జయ జయహే తెలంగాణ గేయం జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. 2.30 నిమిషాలు, 13.30 నిమిషాల నిడివితో జయ జయహే తెలంగాణ గేయం ఉంటుందన్నారు. మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయమని అన్నారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర గీతాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం ఆలపించింది. ఈ గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

అంతకు ముందు ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తెలంగామ జాగృత సమితి నేతలతో సమావేశమయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించి వినిపించారు. గీతంలో చేసిన మార్పులను కవి అందె శ్రీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం 13 నిమిషాలు ఉంటుందని తెలిపారు. చరణాలు తగ్గించి 2.30 నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా వినిపించారు. రెండూ బాగున్నాయని సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలు తెలిపారు.

రాష్ట్ర అధికార చిహ్నం ఖరారు కాలేదు : మఖ్దూం మొహినుద్దీన్, కుమురం భీం, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా చేర్చాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు సూచించగా పరిశీలించాలని కవి అందె శ్రీకి సీఎం సూచించారు. రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేవన్నారు. అందరి సూచనలు తీసుకుంటామని, అవసరమైతే కేబినెట్‌లో, అసెంబ్లీలో కూడా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని నేతలకు సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ జన సమితి నేత కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార గీతాన్ని జూన్ 2న అధికారికంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు.

తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా - మరిన్ని సంప్రదింపుల తర్వాతే! - postpone on TELANGANA NEW EMBLEM

తుది దశకు చేరుకున్న జయ జయహే తెలంగాణ గీతం, చిహ్నం - CM Revanth to Review Telangana Song

Last Updated : May 30, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.