CM Revanth Reddy Review Meet on Fourth City : నూతనంగా ఏర్పాటు కానున్న ఫోర్త్ సిటీలో నెలకొల్పే పరిశ్రమలు, అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలన్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ-పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతవారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో సీఎం సూచించిన మార్పులకు అనుగుణంగా అధికారులు సవరణలు చేశారు.
రేడియల్ రోడ్లకు భూ సమీకరణ : అందులోనూ కొన్నితేడాలు ఉండడంతో మరికొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి అలైన్‌మెంట్ మార్చాలని అది ఫైనల్ అయిపోతే వెంటనే కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం భూసమీకరణ, భూసేకరణ చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో చూడాలన్నారు.
రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రారంభించండి : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth on RRR
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూపకల్పన : డ్రైపోర్ట్ నిర్మాణం కోసం మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏది మేలు అనే విషయాలను అధ్యయనం చేశాకే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైలు, జలమార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలపగా ఇప్పటివరకు దేశంలో ఎక్కడైనా అలాంటిది ఉందా? సక్సెస్ రేట్ ఎంత వాస్తవరూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉందనే అంశాలపై అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు నిర్మించే రహదారిలో 3చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. బెంగళూర్‌లో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకున్న అటవీప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి వస్తాయని సీఎం అన్నారు.
ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అమెరికాలో యాపిల్ పరిశ్రమ యాపిల్ తోటలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రాచకొండ పరిధిలోని లోయలుప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించటానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ట్రిఫుల్‌ఆర్, రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూసమీకరణ, భూసేకరణకుఅన్నిశాఖలు కలిసి పనిచేయాలని, ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూ సేకరణను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి