ETV Bharat / state

మహబూబ్‌నగర్​లో కాంగ్రెస్‌ బహిరంగ సభ - ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి - Public Meeting In Mahabubnagar

CM Revanth Reddy Public Meeting In Mahabubnagar : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్​నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరుకానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana Parliament Elections 2024
CM Revanth Reddy Public Meeting In Mahabubnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 10:18 AM IST

పాలమూరు ప్రజా దీవెన సభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి - ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

CM Revanth Reddy Public Meeting In Mahabubnagar :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో పాలమూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సారిగా జిల్లా కేంద్రానికి రానుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో 15 రోజుల కిందట ప్రారంభమైన వంశీచంద్‌ యాత్ర 7 నియోజకవర్గాల్లో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్​వీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవెన బహిరంగ సభ పేరుతో కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ముఖ్య మంత్రి అయిన తర్వాత తొలిసారిగా కొడంగల్​కు వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ రూ. 5వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం త్వరలోనే ఎమ్మెల్సీ, లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాపై రేవంత్ వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. పాలమూరు సమగ్ర అభివృద్ధి కాంక్షించే వాళ్లంతా స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా చల్లా వంశీచంద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

12 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్​ చేసిన కాంగ్రెస్! - ఇక తేలాల్సింది ఆ 5 సీట్లే

"మహబూబ్​నగర్​లో ఎన్​వీఎస్ కళాశాల మైదానంలో నాలుగు గంటలకు పాలమూరు ముద్దు బిడ్డ ఎనుముల రేవంత్ రెడ్డి న్యాయయాత్ర సభకు హాజరవుతున్నారు. మహబూబ్​నగర్ ప్రజలకు రేవంత్ రెడ్డి అనేక వరాల జల్లులు కురిపించ బోతున్నారు. మొదటిసారి ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్​​నగర్​కి సీఎం వస్తున్నారు. పాలమూరు సమగ్ర అభివృద్ధి కాంక్షించే వాళ్లంతా స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి." -చల్లా వంశీచంద్ రెడ్డి

Telangana Parliament Elections 2024 : మరోవైపు కేంద్రంలో అధికార మార్పు జరగాలంటే రాష్ట్రం నుంచి కనీసం 14 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే ప్రస్తుతం సగటున 4 నుంచి 5 శాతం కాంగ్రెస్‌కు ఓటర్ల శాతం పెరిగినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చినట్లు సర్వేలో తేలిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ముందుకుపోతుండటం, ఆరు గ్యారెంటీల్లో అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు ప్రారంభించిన ప్రభుత్వం, ఇటీవలే మరో రెండు గ్యారెంటీలను అమలు చేసింది.

చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్​ విచారణకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం

క్యా సీన్ హై! - ఎయిర్​పోర్ట్​లో మోదీ, రేవంత్​ల మధ్య సరదా సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.