ETV Bharat / state

పంచాయతీ ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కార్యాచ‌ర‌ణ రూపొందించండి : సీఎం ఆదేశం - CM Review on Panchayat Elections - CM REVIEW ON PANCHAYAT ELECTIONS

CM Review on BC Reservations : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 8:04 PM IST

CM Revanth Reddy Meeting on BC Reservations : స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోకుండా, త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజర్వేష‌న్లపై ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై పట్టిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. సందేహాలు ఉంటే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయ‌తీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన అంశాలపై అడ్వకేట్ జ‌న‌ర‌ల్‌తో చ‌ర్చించాల‌ని సీఎం సూచించారు.

త్వరగా నివేదిక ఇవ్వండి : ఇతర రాష్ట్రాల్లో రిజ‌ర్వేష‌న్ల విధానంపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఆయా అంశాలపై త్వరగా నివేదిక తయారు చేస్తే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు ముందే మరోసారి స‌మావేశ‌మై తుది నిర్ణయం తీసుకుందామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అనుస‌రించిన విధానం, రానున్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు సన్నద్ధతపై అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు. కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం 2011లో 53 కాలమ్స్‌తో కుల గ‌ణ‌న చేసిందని, దానికి మ‌రో మూడు జోడిస్తే, క‌నీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు.

క‌ర్ణాట‌క‌లో 2015లో, బిహార్‌లో 2023లో కుల గ‌ణ‌న చేశార‌ని, ఏపీలోనూ చేసినప్పటికీ వివ‌రాలు బయటపెట్టలేదని అధికారులు తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల పెంపు సాధ్యాసాధ్యాల‌పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోద‌ర రాజ‌ న‌ర్సింహ‌, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ‌, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి కె.జానారెడ్డి, బీసీ క‌మిష‌న్ ఛైర్మన్ వ‌కుళాభ‌రణం కృష్ణ‌మోహ‌న్‌ త‌మ అభిప్రాయాల‌ను వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. స‌మావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎంవో ఉన్నతాధికారులు వి.శేషాద్రి, జి.చంద్రశేఖర్ రెడ్డి, బీసీ సంక్షేమం, పంచాయతీ రాజ్, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, లోకేశ్‌ కుమార్‌, తిరుప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం: సీఎం రేవంత్‌ - CM Revanth On Local Body Elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.