ETV Bharat / state

మా ప్రభుత్వ పనితీరే కొలమానం - పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరతాం: సీఎం రేవంత్ - పార్లమెంట్​ ఎన్నికలపై రేవంత్ ఫోకస్​

CM Revanth Reddy on Lok Sabha Polls 2024 : తమ ప్రభుత్వ పనితీరును చూసి ఓటేయాలని ప్రజలను కోరుతామని, లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా రెండంకెల సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 7న దిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత తొలిజాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​ కుమ్మక్కయ్యాయని ఆరోపించిన సీఎం, బీఎస్పీ పొత్తుతో నిజరూపాలు బయట పడ్డాయన్నారు. మోదీని పెద్దన్న అనడంలో తప్పేముందన్న ముఖ్యమంత్రి, రాష్ట్రాభివృద్ధి గురించి ప్రధానికి చెప్పడం తన బాధ్యత అన్నారు.

CM Revanth Focus on MP Elections
CM Revanth Reddy Chit Chat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 7:03 AM IST

మా ప్రభుత్వ పనితీరే కొలమానం - పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరతాం: సీఎం రేవంత్

CM Revanth Reddy on Lok Sabha Polls 2024 : రాష్ట్రంలో 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతోందని, రెండంకెల సీట్లు కచ్చితంగా గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 7న దిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee) సమావేశం తర్వాత తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. తమ కుటుంబం నుంచి ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని సీఎం స్పష్టం చేశారు.

రాహుల్‌ గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామని రేవంత్ అన్నారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) తమ ప్రభుత్వ పనితీరును చూసి ఓటేయాలని ప్రజలను కోరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​ అవగాహనతో వెళ్తున్నాయని మెదక్, చేవెళ్ల స్థానాలకు గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం దీన్ని తేటతెల్లం చేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్​తో ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ భేటీ, బీఆర్​ఎస్​, బీఎస్పీ పొత్తు వారి నిజరూపాలను బయట పెట్టిందని ఆరోపించారు.

CM Revanth Fires on BRS : మోదీని పెద్దన్నగా అభివర్ణిస్తూ మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీ​ చేస్తున్న విమర్శలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. నరేంద్రమోదీని పెద్దన్న అనడంలో తప్పేముందన్న ఆయన, రాష్ట్రాభివృద్ధిపై ప్రధానితో చెప్పడం తన బాధ్యత అన్నారు. తాను కేసీఆర్​లాగా కుమారుడిని సీఎం చేయమని చెవిలో గుసగుసలాడలేదని, 4 కోట్ల ప్రజల తరఫున రాష్ట్రానికి అవసరమైన విషయాలు బహిరంగంగానే అడిగినట్లు చెప్పారు.

క్యా సీన్ హై! - ఎయిర్​పోర్ట్​లో మోదీ, రేవంత్​ల మధ్య సరదా సంభాషణ

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో సంబంధం లేకుండా తుమ్మిడిహట్టిని నిర్మిస్తామని, ఆదిలాబాద్‌కు మరో ప్రత్యామ్నయం లేదని సీఎం స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుతో లక్షా 66 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, దానికోసం మహారాష్ట్రలో 1,850 ఎకరాలు సేకరించాల్సి ఉన్న విషయాన్నే ప్రధానిని కోరానని చెప్పారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మేడిగడ్డ విషయంలో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కుమ్మక్కు : పార్లమెంటు ఎన్నికల్లో కమలం, కారు పార్టీలు​ పరస్పరం సహకరించుకునేందుకే, విచారణ కోసం ఎన్​డీఎస్​ఏ నాలుగు నెలల సమయం అడుగుతోందన్నారు. మరమ్మతు చేసి నీళ్లివ్వాలని కేటీఆర్(KTR), హరీశ్‌రావు అంటున్నారని, బ్యారేజీ ఎంతవరకు భద్రమో నిపుణులు తేల్చనిదే ఎలా చేస్తామని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అవినీతితో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మద్యం కుంభకోణం వెలికి తీస్తున్నామని, జీఎస్టీలో బీఆర్​ఎస్​ నేతల అక్రమాలనూ బయట పెడతామన్నారు. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్తూపం నిర్మాణం, సీఎమ్​ఆర్​ఎఫ్​ నిధులపై కూడా విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను క్రమంగా చక్కదిద్దుతున్నామని, పెండింగ్‌ బిల్లులను ఒక్కొక్కటిగా చెల్లిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy Comments on KCR : రైతు భరోసాపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని, రాళ్లు రప్పలు, రోడ్లకు, ఆదాయపన్ను చెల్లించే వారికీ, గజ్వేల్, జన్వాడలో ఫాంహౌజ్‌లున్న వారికి మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. డిగ్రీ మాత్రమే చదివిన కేసీఆర్​, పీజీ చదివినట్లు పార్లమెంటుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను ప్రతిపక్షనేతగా(Opposition Leader) ఎలా అనుకోవాలని సీఎం ఎద్దేవా చేశారు. ఎల్​ఆర్​ఎస్​పై కేటీఆర్​ సిరిసిల్లలో నిరాహారదీక్ష చేసి, చిత్తుశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.

చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్​ విచారణకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం

మోదీ జీ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించండి - ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.