ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy on Irrigation Projects : మేడిగడ్డ మేడిపండేనా అని 2015లో మీ మిత్రుడి పత్రికలో వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వాస్తవాలను పెడచెవిన పెట్టి దోచుకుని, దాచుకోవాలని చూశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదని, కలంకంగా మారిందని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణను దివాలా తీయించారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

CM Revanth Reddy
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 2:17 PM IST

CM Revanth Reddy on Irrigation Projects : అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగుతోంది. నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయాలు చెప్పాయని, ఇతరులు ఇచ్చే నివేదికను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఐదుగురు ఇంజినీర్ల కమిటీ ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.

'తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వ తప్పులు ఒప్పుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. తప్పులు ఒప్పుకుని సలహాలు ఇస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేది. తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు. మంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారని' రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

గత ప్రభుత్వం దోచుకున్నది దాచుకోవడం పైనే దృష్టి పెట్టింది : సీఎం రేవంత్​ రెడ్డి

Telangana Assembly Sessions 2024 : మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 2012లో ఒప్పందం జరిగిందని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణ అడ్డంకులు తొలగించేందుకు చర్చలు జరిగాయని తెలిపారు. అంతర్రాష్ట్ర బోర్డు, స్టాండింగ్‌ కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు జరిగిందని వివరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు చర్చించారని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి 152 మీటర్ల వద్ద కడితే మహారాష్ట్రలో 1850 ఎకరాలు ముంపునకు గురవుతుందని, అదే తుమ్మిడిహట్టి 150 మీటర్ల వద్ద కడితే మహారాష్ట్రలో 1250 ఎకరాలు ముంపునకు గురవుతుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

కేసీఆర్​పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్​

Revanth Fires on BRS : మేడిగడ్డ (Medigadda Barrage) వద్ద ప్రాజెక్టు కట్టాలని నాటి సీఎం ఇంజినీర్లను ఆదేశించారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 151 మీటర్ల వద్ద కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని కమిటీ చెప్పిందని తెలిపారు. కనీసం 150 మీటర్ల వద్ద అయినా ప్రాజెక్టు కట్టేందుకు ఒప్పించాలని వారు కోరారని చెప్పారు. మేడిగడ్డ ద్వారా మిడ్‌మానేరుకు 160 టీఎంసీలు ఎత్తిపోతల సరికాదని కమిటీ చెప్పిందని వివరించారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం తొక్కిపెట్టిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

"కేసీఆర్‌, హరీశ్‌రావు రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో నివేదిక ద్వారా తెలుస్తుంది. ప్రాజెక్టు అంచనాలను రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. ఖర్చు పెట్టిన నిధులు ఉపయోగపడి ఉంటే ఇంత చర్చ అక్కర్లేదు. మేడిగడ్డ మేడిపండేనా అని 2015లో మీ మిత్రుడి పత్రికలో వచ్చింది. వాస్తవాలను పెడచెవిన పెట్టి దోచుకుని దాచుకోవాలని చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదు కలంకంగా మారింది. పదేళ్లలో తెలంగాణను దివాలా తీయించారు." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది''

పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.