ETV Bharat / state

రాజీనామా చేసి సెలక్షన్లు, కలెక్షన్లను త్యాగమని కొందరు చెప్పుకుంటున్నారు : సీఎం రేవంత్​ - CM REVANTH INAGURATES IIHT

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 2:07 PM IST

Updated : Sep 9, 2024, 3:24 PM IST

CM Revanth Inaugurate IIHT :చేనేతల కార్మికులకు 30కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ చీరల నాణ్యత సరిగా లేదన్న సీఎం, మంచి నాణ్యతతో స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసి కొండా లక్ష్మణ్‌ బాపూజీ త్యాగం చేస్తే, కొందరు ఉపఎన్నికల పేరుతో సెలెక్షన్లు, కలెక్షన్ల పేరుతో కోట్లు గడించారని బీఆర్ఎస్​ పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేశారు.

cm revanth good news to womens
CM Revanth Inagurate IIHT (ETV Bharat)

CM Revanth Reddy Inaugurate IIHT : హైదరాబాద్​లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని (ఐఐహెచ్​టీ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్​గా ప్రారంభించారు. లలిత కళా తోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం ప్రారంభించారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా తెలుగు యూనివర్సిటీలో ఈ ఏడాది తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. స్కిల్‌ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక పూర్తిస్థాయిలో అక్కడ ఏర్పాటుచేయనున్నారు.

ఈ కేంద్రంలో ఏటా 60 మందికి టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధునాతన పరిశోధన అవకాశాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించారు. నేతన్న చేయూతకు సంబంధించి రూ.290 కోట్లు చెక్కును చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు అందజేశారు. చేనేత పొదుపు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నామినీలకు భీమా చెక్కులు అందించారు.

మా ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటే : ఐఐటీహెచ్ విద్యార్థులకు నెలకు రూ.2,500 చొప్పున అందించే స్కాలర్​షిప్‌లను సీఎం అందజేశారు. తెలంగాణలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పదేళ్లలో కేంద్రం చర్యలు చేపట్టలేదని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రులను కోరామని వారు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

గత ప్రభుత్వం హంగు, ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. పవర్‌లూమ్‌ రంగం ఉపాధి కల్పించే ఉద్దేశంతో నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా మహిళ సంఘాలకు ఏటా రెండు చీరలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటేన్నన్న రేవంత్‌, చేనేతలకు సంబంధించిన రూ.30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరును ఐఐహెచ్​టీకి పెడతామని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్‌ పదవులు త్యాగం చేస్తే, కొందరు ఉపఎన్నికల పేరుతో కలెక్షన్లు, సెలక్షన్లతో కోట్లు సంపాదించారని ఆరోపించారు. నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. చేనేతల ట్రేడ్‌ మార్క్‌ కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

"కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి, త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు కేసీఆర్​కు నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినపుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా ఆయనే. 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ నేను పదవులను చేపట్టనని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన మహామనిషి ఆయన. అలాంటిది నేడేమో కొందరు రాజీనామాలు చేయటం, ఎలక్షన్లు​ తేవటం, సెలక్షన్​ చేయటం, కలెక్షన్​ చేసుకోవడం త్యాగమని చెప్పుకుంటున్నారు.- రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలి : కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Meet With Shivraj Singh

ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం: సీఎం - CM Revanth Reddy On AI

Last Updated : Sep 9, 2024, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.