ETV Bharat / state

తెలంగాణ సాధించుకోవడానికి 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తిగా పని చేసింది : సీఎం రేవంత్​ రెడ్డి

తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ముఖ్య ఉద్దేశం - రాజకీయాలతో సంబంధం లేకుండా 'అలయ్​ బలయ్'​ నిర్వహణ అభినందనీయం : సీఎం రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

CM Revanth Participate in Alai Balai Program
CM Revanth Participate in Alai Balai Program (ETV Bharat)

CM Revanth Speech in Alai Balai Program : తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావానికి కూడా అలయ్‌ బలయ్‌ ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మనందరి బాధ్యతగా సీఎం పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయన్నారు. అన్ని సామాజిక వర్గాలు కార్యోన్ముఖులు కావడానికి అలయ్ బలయ్‌ దోహదపడిందని సీఎం వివరించారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద పండగ దసరా అని, ఈ పర్వదినాన అందరికీ గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అన్నారు. మరోవైపు ‘అలయ్‌ బలయ్‌’ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ‘అలయ్‌ బలయ్‌’ స్ఫూర్తిగా పనిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా కార్యక్రమ నిర్వహణ అభినందనీయం : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో పది మందిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన గొంగళితో సన్మానించారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకు వెళ్లడం అభినందనీయమని సీఎం అన్నారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్‌, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్‌ బలయ్‌లో పాల్గొన్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని, అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను దత్తాత్రేయ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.

"తెలంగాణ ఉద్యమంలో జెండాలకు అజెండాలకు అతీతంగా ఒక పొలిటకల్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ అలయ్​ బలయ్​ కార్యక్రమం స్ఫూర్తిగా పనిచేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా చెప్తున్నాను. అంతకముందు ఎవరికి వారు దసరా పండుగ పూర్తి చేసుకొని కుటుంబంలో ఉండే పెద్దలకు, మిత్రులకు జమ్మి పెట్టి అలయ్​ బలయ్​ చేసుకొని మనమందరం అభివృద్ధిపథం వైపు నడవాలి, మన ప్రాంతం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకునేదే ఈ పండుగ." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

"బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు - పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు మాత్రం తిలోదకాలు"

సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామంలో రేవంత్​ పర్యటన - ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.