ETV Bharat / state

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: సీఎం రేవంత్‌రెడ్డి - Telangana Talli Celebrations 2024 - TELANGANA TALLI CELEBRATIONS 2024

Telangana Talli Celebrations 2024 : ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసామని వెల్లడించారు. ఈ సంవత్సరం జరిగే వేడుకలకి కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీని పిలవాలనుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telangana Talli Celebrations 2024
Telangana Talli Celebrations 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 4:47 PM IST

Updated : Jun 5, 2024, 5:28 PM IST

Telangana Talli Celebrations 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. ఏటా డిసెంబర్​ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీని పిలవాలనుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Telangana Talli Idol History : తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా దీన్ని ఉద్యమ ప్రతీకగా నాయకులు ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత బీఎస్​ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల తరవాత కంప్యూటర్​పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బీవీఆర్ చారి. సాధారణ స్త్రీ మాదిరిగా కొంగు నడుముకి చుట్టుకొని ఉన్న తెలంగాణ రూపాన్ని ఆయన చిత్రించాడు. ఈ రూపంలో దేవులపల్లి అజయ్​ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్​ పేజీపై మొదటిసారిగా ప్రచురితమైంది. అనంతరం గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లికి మార్పులు చేస్తూ ప్రస్తుతం ఉన్న మాదిరిగా తయారు చేశారు.

రాష్ట్రచిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహమార్పుపై మండలిలో వాడివేడి చర్చ

తెలంగాణ తల్లి విగ్రహ విశేషాలు : తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణ తల్లి రూపకల్పనలో జోడించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్​ వెండి మెట్టెలు, కోహినూర్​ వజ్రం, జాకబ్​ వజ్రం, పాలమూరు, మెదక్​, అదిలాబాద్​ మెట్ట పంటలకు చిహ్నంగా జొన్న కంకెలు, నిజామాబాద్, వరంగల్​ జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాత ముద్దు బిడ్డగా అందమైన కిరీటం,​ వడ్డాణం, జరీ అంచుచీర నిండైన కేశ సంపద ఇలా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు ఉన్నాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పు చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా తుది రూపంపై చర్చలు జరుగుతున్నాయని అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని వివరించారు.

తెలంగాణ కొత్త చిహ్నంపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం - సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ - DISCUSSION ON TS EMBLEM IN ASSEMBLY

Last Updated : Jun 5, 2024, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.