CM Revanth order to investigate Dharani Agency : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీతో సమావేశమైన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది రైతుల భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గోప్యంగా ఉండాల్సిన భూములు, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడాన్ని సీఎం తప్పుపట్టారు.
CM Revanth Review on Dharani Portal : ధరణి పోర్టల్‌లో(Dharani Portal) భూముల రికార్డుల డేటాకు భద్రంగా ఉన్నట్లేనా అని సీఎం అధికారులను అడిగారు. విలువైన భూములకు పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందన్న సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. భూముల రికార్డులను విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు సీఎంకు తెలిపారు.
అయితే ఆ కంపెనీ దివాళా తీసిందని, ఆ తర్వాత టెర్రాసిస్ అని పేరు మారడంతో పాటు డైరెక్టర్లందరూ మారిపోయారని వివరించారు. ఆ తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీకి చేతులు మారాయని తెలిపారు. అయితే బిడ్ దక్కించుకున్న కంపెనీ మారిపోతే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు కూడా అప్పగించేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'
ధరణి టెండరును 2018లో 116 కోట్ల రూపాయలకు దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు 1200 కోట్లకు అమ్ముకోవటం ఆశ్చర్యంగా ఉందని సీఎం అన్నారు. రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున, విలువైన భూముల యాజమాన్య పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా? అని సీఎం రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.
Dharani Committee Recommendations : మరోవైపు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ధరణి కమిటీ పలు ప్రధాన లోపాలను సీఎం దృష్టికి తీసుకొచ్చింది. 2020 ఆర్వోఆర్(ROR) చట్టంలోనే లోపాలున్నాయని స్పష్టం చేసింది. కేవలం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని సీఎం రేవంత్‌కు కమిటీ సభ్యులు వివరించారు. ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ లేదా కొత్త ఆర్వోఆర్ చట్టం చేయాలని ధరణి కమిటీ సిఫార్సు చేసింది.
రైతులకు గుడ్‌న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్
'బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎంతో నష్టపోయాం - వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి'