ETV Bharat / state

ఈనెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు - ఆదివారం మాత్రం బ్రేక్ - TELANGANA ASSEMBLY SESSSIONS 2024

Telangana Assembly Session 2024 Today : తెలంగాణ శాసనసభ బడ్జెట్​ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా కంటోన్మెంట్​ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాప తీర్మానం సీఎం రేవంత్​ రెడ్డి ప్రవేశపెట్టారు. మరోవైపు సభ అనంతరం జరిగిన బీఏసీ భేటీలో ఈనెల 31వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

CM Revanth
CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 12:16 PM IST

Updated : Jul 23, 2024, 2:14 PM IST

Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం సహా అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.

అసెంబ్లీ సమావేశం తొలిరోజు సమావేశం తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మినహా ఈనెల 31వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే మరొకసారి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు లాస్యనందిత మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని సీఎం రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారని గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్​ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రమాదవశాత్తు ఆమె మరణించడం బాధాకరమని సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"సాయన్న మృదుస్వభావి. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని సాయన్న కోరిక. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరు. లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

బీఆర్​ఎస్​ సంతాపం : శాసనసభలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్​ఎస్​ సంతాపం తెలిపింది. సాయన్న మరణం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చిందని కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత ఆవేదన కలిగించిన అంశమని ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

లాస్య నందిత మృతికి బీజేపీ సంతాపం : కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీజేపీ తరఫున శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి సంతాపం తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్​ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారని, లాస్య నందితకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించామని, దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు మన మధ్య నుంచి తీసుకెళ్లారని చింతించారు.

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం : లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లాస్య నందిత మృతికి సంతాపం తెలుపుతున్నామని తెలిపారు. ఓఆర్​ఆర్​పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తనయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని గుర్తు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కారు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

నేటి నుంచే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు - ఆరుగ్యారంటీల అమలుపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ - Telangana Assembly Sessions 2024

Last Updated : Jul 23, 2024, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.