ETV Bharat / state

దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి - మంత్రి వర్గ విస్తరణపై నేడే క్లారిటీ! - CM Revanth Delhi Tour

CM Revanth Delhi Tour : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోతుందా? ఎన్ని మంత్రి పదవులకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది? సామాజిక సమతుల్యతపై ఏకాభిప్రాయం వస్తుందా? రాకుంటే కాంగ్రెస్‌ పెద్దలు ఏవిధంగా ముందుకు వెళ్తారు? ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయి? ఇలా సవాలక్ష ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల బుర్రలను తొలుస్తున్నాయి. సీఎం రేవంత్ దిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ విషయం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

CM Revanth Delhi Tour
CM Revanth Delhi Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 7:24 AM IST

Updated : Aug 23, 2024, 8:16 AM IST

CM Revanth Delhi Tour : రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై దిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర నాయకులు ఇవాళ సమావేశమవుతారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు పార్టీ కోర్‌ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వీరు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆరుగురిని కేబినెట్​లోకి తీసుకునే అవకాశం : సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. ఇందులో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో సామాజిక సమతుల్యత పాటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దానిని అధిగమించేందుకు నాయకులు పలు మార్లు మేధోమథనం జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే ఛాన్స్ : ఈ నేపథ్యంలో మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌పై నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెర పడుతుందని కాంగ్రెస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్‌ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పరిగి రామ్మోహన్‌ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్‌, బాలునాయక్‌, రామచంద్రనాయక్‌ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమిర్ అలీఖాన్, కోదండ రాం తదితరులు ఉన్నారు. ఖాళీ ఉన్న ఆరింటిని భర్తీ చేసినా కూడా మంత్రి పదవులు రాకుండా మిగిలే వారెక్కువ ఉన్నారు. మంత్రి మండలిలో అవకాశం దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసి అభివృద్ధి ఆథారిటీ ఛైర్మన్‌ వంటి నామినేటెడ్ ప‌ద‌వులను ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

సామాజిక సమీకరణల చిక్కుముడి : మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇక్కడ కూడా సామాజిక సమీకరణలే ఆటంకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎంపిక ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డినే కొనసాగాలని అధిష్ఠానం స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐసీసీ పునర్వ్యవస్తీకరణ తర్వాత నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చెయ్యడం శ్రేయస్కరమని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

హస్తినలో రేవంత్ రెడ్డి : దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్‌, ప్రియాంక‌, సోనియాగాంధీల‌ను ఆహ్వానిస్తారని, రూ.2లక్షలు రుణ‌మాఫీ చేసినందున వ‌రంగ‌ల్‌లో నిర్వహించ‌నున్న కృత‌జ్ఞత స‌భ‌కు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం నుంచి రాజ్యస‌భ స‌భ్యుడిగా అభిషేక్ మ‌ను సింఘ్వి ఏక‌గ్రీవ ఎంపిక, రాష్ట్రంలో గ‌డిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ‌లు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమ‌లు త‌దిత‌ర అంశాల గురించి కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ఆ అంశాలపైనే చర్చించేందుకేనా?

ఇవాళ సీఎం రేవంత్ దిల్లీ పర్యటన - మిగిలిన 8మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ - cm revanth reddy delhi tour

Last Updated : Aug 23, 2024, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.