CM Jagan To Announce YSRCP MLA and MP Candidates: ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటి వరకూ 12 జాబితాల్లో సమన్వయ కర్తలను ప్రకటించిన సీఎం జగన్, పోటీ చేసే అభ్యర్థుల పేర్లను నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇడుపులపాయలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి.
అభ్యర్థుల ప్రకటన: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఇవాళ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు ( YSRCP MLA and MP List) కలిపి మొత్తం 200 స్థానాలకు ఎవరెవర్ని బరిలోకి దింపేది నేడు వెలువరించనున్నారు. ఈ ఉదయం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్ మధ్యాహ్నం తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడే వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటిస్తారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా అక్కడే విడుదల చేయనున్నారు.
తెలుగుదేశం టికెట్ ఆశావహులు వీరే, రెండో జాబితా కోసం నేతల ఎదురుచూపులు
ఎన్నికల మేనిఫెస్టో: ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర గంటల వరకు, అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల పూర్తిచేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి గన్నవరం బయల్దేరి వెళ్లనున్నారు. 2019 ఎన్నికలకు కూడా అభ్యర్థుల ఇడుపులపాయలోనే జగన్ అభ్యర్థులను ప్రకటించారు. 2019 మార్చి 17న అభ్యర్థులను ప్రకటించగా, ఈసారి మార్చి 16న ప్రకటన చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో, వివేకా హత్య Viveka's murder) జరిగిన రెండు రోజులకు అభ్యర్థులను ప్రకటించగా, ఈసారి ఐదో వర్ధంతి మరుసటి రోజున ప్రకటన చేస్తున్నారు.
ఈనెల 16న వైసీపీ తుది జాబితా - ఆశావహులు, అసంతృప్తులతో సీఎం జగన్ భేటీ
మార్పులు చేర్పులు జరిగేనా?: వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈమేరకు ఆశావహులు, అసంతృప్తులతో వైఎస్సార్సీపీ పెద్దలు చర్చలు జరిపారు. టికెట్ రాని అభ్యర్థులు, ఆశవాహులు పార్టీనుంచి జంప్ అవుతారో అన్న అనుమానంతో సీఎం జగన్ సైతం పలువురు నేతలతో సమావేశమై వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పలుచట్ల అభ్యర్థులను మార్చాలని స్థానిక నేతలు, కార్యకర్తలు పట్టుబడుతోన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామనే హామీతో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు