ETV Bharat / state

జలాశయాల నిర్వహణను పట్టించుకోని జగన్​ - ఐదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS

CM Jagan Neglected the Projects : సీఎం జగన్​ అయిదేళ్ల పరిపాలనలో జలాశయాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో తొమ్మిదిసార్లు అనూహ్య దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. జలాశయాల విధ్వంస రచనలో జగన్​ చెరిగిపోని రికార్డు నమోదు చేసుకున్నారు.

cm_jagan_projects
cm_jagan_projects
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 12:31 PM IST

జలాశయాల నిర్వహణకు నీళ్లొదిలిన జగన్​ - ఫలితంగా అయిదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు

CM Jagan Neglected Irrigation Projects in AP : జగన్​ సీఎం ఉన్న అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంస పర్వమే కొనసాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాక ఉన్నవాటి నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. జగన్​ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి, కృత్రిమ విపత్తుల్లో రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తే నాయకుడిగా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించి, వారికి అండగా నిలవాలి. ప్రాణ, ధన నష్టం అతి తక్కువగా వాటిల్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా ఈ అయిదేళ్ల పాలనలో జగన్​ అనే విపత్తుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. ఇందుకు ప్రజల కళ్లముందే సంభవించిన దుర్ఘటనలు సాక్ష్యాలుగా నిలిచాయి.

ముందు చూపు ఎక్కడ ? : వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా స్పందించి విపత్తు నిర్వహణపై సీఎం జగన్​ ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. సాగునీటి రంగంలో ఎక్కడ ఏ అధికారిని నియమించుకోవాలి. ఏ ప్రాజెక్టు నిర్వహణలో ఎవరికి అనుభవముందన్న పరిశీలన ఎప్పుడు జరగలేదు. వరద సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కనీస అవగాహన లేని “తన” వాళ్లకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొనితెచ్చిన పాలకుడిని ఏమనాలి? అలాంటి వారి పాలనలో ఏం జరుగుతుంది? అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్యాం దిగువనున్న గ్రామంలో కొందరు అనుభవజ్ఞులు వందల మందిని అప్రమత్తం చేశారు. కొండలు, గుట్టలు ఎక్కించి వారి ప్రాణాలను రక్షించారు. విపత్తును ఊహించినా జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూశారు.

ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్​ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే

జగన్ సృష్టించిన కృత్రిమ విపత్తులు :

  • 2020లో కృష్ణా నదికి వచ్చిన వరదను సరిగ్గా నిర్వహించని ఫలితంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయాయి. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్​ బరస్ట్​ ( అతి భారీ వర్షాలు) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చారించిన లెక్క చేయలేదు. అక్కడ భారీ వర్షాలు కురిస్తే నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
  • 2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరు పైనా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ రెండేళ్లలోనూ క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  • 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైన విషయం అందరికి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యాంలోని గ్యాప్​లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో డయాఫ్రం వాల్​ను మళ్లీ రూ. వందల కోట్లుతో కొత్తగా నిర్మించాల్సి వచ్చింది.
  • 2021 ఆగఘ్టలో పులిచింతల ప్రాజెక్ట్​లోని 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి రెండేళ్లుగా గేట్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అనుభవజ్ఞులు సృష్టం చేశారు.
  • 2021లో కురిసిన భారీ వర్షాలకు పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది.
  • 2021లో అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయింది. దీంతో 39 మంది మరణించారు. ఇళ్లు మునిగి, వందల కుటుంబాలు వీధిన పడ్డారు. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగు చేయడానికి వైసీపీ సర్కారు నిధులను మంజూరు చేయలేదు. భారీ వరదపై సమాచారం ఉన్న గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం చేశారు.
  • 2022 ఆగస్టు 31 రాత్రి గుండ్లకమ్మలో 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. నిధుల మంజూరుకు జగన్ సర్కారు స్పందించక పోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది.
  • 2023 డిసెంబరు 8న రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు మరోసారి కొట్టుకుపోయింది. అంతకు ముందు కొట్టుకుపోయిన 3వ నంబరు గేటును కూడా జగన్ సర్కారు మళ్లీ బిగించకలేకపోయింది.
  • 'పోలవరం'లో నిర్మించిన గైడ్​బండ్ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైసీపీ సర్కారు వచ్చాక చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడం, తగిన సమయంలో కట్టడాన్ని పూర్తి చేయకపోవడమే కారణమని నిపుణులు తేల్చి చెప్పారు.

జగన్​ హామీల డ్రామాలకు నిదర్శనం వరికపూడిశెల- పల్నాడు గడ్డకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం - Varikapudishela Project

బాధపడరు, బాధ్యత వహించరు : రాష్ట్రంలో ఉన్నా ప్రాజెక్టులకు గ్రీజు పెట్టడానికి డబ్బులు కావాలని, శ్రీశైలం జలాశయంలో చేసిన పనులకు బిల్లులివ్వాలని అధికారులు సీఎం జగన్​కు విన్నవించుకున్నా స్పందించలేదు. వర్ష కాలానికి ముందే ప్రాజెక్టులకు ఏ అవసరాలు ఉన్నాయో సమీక్షించరు. నిధులను మంజూరు చేయరు. ఫలితంగా శ్రీ శైలం గేట్ల మీది నుంచి వరద నీరు ప్రవహింస్తున్న పట్టించుకోరు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఒక్కసారి కాదు కదా! ఏకంగా రెండు సార్లు గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల గేటూ వరదపాలైన పట్టించుకోరు. ఏమైనా జరగనివ్వండి 'మేం బాధపడం, బాధ్యత వహించం' అనేది వైసీపీ సర్కారు సిద్ధాంతం.

గుత్తేదారులూ ముందుకు రావడం లేదు : అధికార పార్టీ బిల్లులు సరిగా చెల్లించపోవడంతో చిన్నచిన్న పనులు చేసేందుకు సైతం గుత్తేదారులు ముందుకు రావడం లేదు. తక్కువ మొత్తంలోని బిల్లులకు కూడా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని గుత్తేదారులు భయపడుతున్నారు. శ్రీ శైలం ప్రాజెక్టు, ధవళేశ్వరం కాటన్​ బ్యారేజి మరమ్మతులకు గుత్తేదారులను పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందించలేదు. రాష్ట్రంలో డ్యాం భద్రతా కమిటీ తరపున ప్రతి సంవత్సరం కొన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్వహణ, ఇతర సమస్యలను పరిశీలించాలి. వాటి నిర్వహణకు చేపట్టాల్సిన పనులపై నివేదికలిచ్చినా అందుకు తగ్గ చర్యలు ఏవీ లేవు. డ్యాం కుంగిపోయినా, గేట్లు కొట్టుకుపోయినప్పుడు నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు.

ఐదేళ్లుగా భూ సర్వే, డిజైన్లకే పరిమితం ​- జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు ఊసెత్తని జగన్ - Jeedipally Peruru Project

కొద్దిపాటి నిధుల విడుదలపైనా నిర్లక్ష్యం : ప్రాజెక్టుల నిర్వహణకు కొద్దిపాటి నిధులను కూడా జగన్ సర్కారు ఇవ్వడం లేదు. అత్యంత విలువైన ఈ డ్యాంలను కాపాడుకునేందుకు ప్రతి సంవత్సరం నిర్వహణ పనులను తప్పనిసరిగా చేపట్టాలనే విషయాన్ని విస్మరించారు. అన్ని పరికరాలను తనిఖీ, గ్రీజు పెట్టుకోవాలి, తలుపులు ఎత్తే వ్యవస్థలను పరీక్షించుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టిందా, గట్టిగా ఉన్నాయా అనేది పరిశీలించి ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. ఇలాంటి పనులకు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించినా పట్టించుకోలేదు.

  • విశాఖలోని మేహాద్రిగడ్డ రిజర్వాయర్ స్పిల్ వే గేట్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నా నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. ఆరు గేట్లలో రెండు పూర్తిగా తెరవడానికి వీల్లేని దుస్థితికి చేరాయని చెబుతున్నా లెక్క చేయలేదు. వీటి మరమ్మతుకు రూ.3.4 కోట్లు అవసరమని నాయకులకు అధికారులు నివేదించినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
  • ఉత్తరాంధ్రలోని రైవాడ జలాశయంలోనూ గేట్లు పాడైన నిధులను మంజూరు చేయడం లేదు. కోనాం జలాశయంలో స్పిల్వే గేటు కుంగిపోయింది. పెద్దేరు జలాశయంలోనూ నీరు లీకవుతోంది.
  • రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయి. రాయలసీమలోని అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్వహణకు సైతం నిధులు ఇవ్వలేదు. సుంకేశుల ప్రాజెక్టు అనేక సమస్యల్లోనే ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలానికి అడుగడుగునా సవాళ్లే. ప్రాజెక్టులో మూడు సబ్ డివిజన్ల కింద నిర్వహణకు నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదించినా నాయకులు స్పందించలేదు. చివరికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి.

పోలవరాన్ని జల్లెడ పడుతున్నారు!- నిషేధిత వలలతో చేపల వేటపై స్థానికుల ఆందోళన - Illegal Fishing

ఆదేశాలే తప్ప ఆచరణ లేదు : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిసెంబర్​ 9,2021న తన యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో ఉన్నా ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. వీటివల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగానికి ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద నిధులిస్తున్నా జగన్ వాటిని అందుకోలేకపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.