ETV Bharat / state

జగన్ ప్రచార మోత, మారని బడిరాత - పూరిగుడిసెలో పాఠాలు, రేకులషెడ్డులో రాతలు

CM Jagan Neglect of Govt Schools Nadu-Nedu Scheme: పూరిగుడిసెలో పాఠాలు, రేకులషెడ్డులో రాతలు, శిథిల భవనాల్లో చదువులు ఇది రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితులు. నాడు - నేడు మొదలై ఐదేళ్లవుతున్నా చాలా సర్కారీ విద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ జగన్‌ ముఠా మాత్రం నాడు - నేడు కింద అద్భుతాలు చేసేశాం అన్నట్లు జబ్బలు చరుచుకుంటోంది. అనేక బడుల్లో రెండో విడత పనులే పూర్తి కాలేదు. పనులు మొదలై నాలుగున్నరేళ్లయినా నిధులివ్వకుండా నాన్చుతున్నారు. ఆరంభ శూరత్వంతో ఉన్నభవనాలు పడగొట్టిన ప్రభుత్వం కొత్తవి కట్టడంలో జాప్యం చేస్తోంది.

nadu_nedu_scheme
nadu_nedu_scheme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:12 PM IST

జగన్ ప్రచార మోత మారని బడిరాత - పురిగుడిసెలో పాఠాలు, రేకులషెడ్డులో రాతలు

CM Jagan Neglect of Govt Schools Nadu-Nedu Scheme: సర్కారీ బడిని సమూలంగా మార్చేస్తామంటూ జగన్‌ ఊదరగొట్టారు. ఏడాదికి 15వేల స్కూళ్ల చొప్పున మూడేళ్లలో 45వేల ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతామంటూ ఆర్భాటం చేశారు. కానీ పథకం ప్రారంభించి నాలుగున్నరేళ్లయినా 32వేల బడులనే పరిగణలోకి తీసుకున్నారు. వాటిలోనూ పనులు పూర్తైంది నామమాత్రమే.

Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇరిడి ప్రభుత్వ పాఠశాలలో 52 మంది విద్యార్థులు చెట్టునీడన ఉన్న రేకులషెడ్డులో చదువులు సాగిస్తున్నారు. బడి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. నాడు-నేడు రెండో విడతలో ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంది. నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభమై నెలలు గడిచినా పునాదుల దశ దాటలేదు.

మరో చోట గుమ్మలక్ష్మీపురం మండలంలోని తోలుఖర్జ బడిదీ ఇదే దుస్థితి. 15 మంది విద్యార్థులున్న ఈ స్కూల్‌లో పాఠశాల భవనం లేక నాలుగేళ్ల క్రితం రేకుల షెడ్డు నిర్మించారు. పక్కా భవనం కోసం నాడు-నేడు రెండో విడతలో 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటిదాకా విడుదల చేసింది 7 లక్షల 25వేలే. నిధుల్లేక పనులు నిలిచాయి. తెచ్చిన సిమెంట్‌కూడా గడ్డకట్టిపోతోంది.

ఇదే జిల్లాలోని సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీలో శిఖరాగ్ర గ్రామమైన పనసలవలసలోపాఠశాల భవనం లేక ప్రార్ధనామందిరంలో పాఠాలు చదువుతున్నారు. గగనపుదొరవలస ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణమూ పనులు పూర్తై ఏడాదిన్నర కావాస్తున్నా పునాదుల స్థాయి దాటలేదు. గ్రామంలోని ఇళ్లలోనే విడతలవారీగా ఉపాధ్యాయులు చదువులు చెబుతున్నారు.

ఊడిన స్కూలు స్లాబ్‌ పైపెచ్చులు - విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Prakasam District: ప్రకాశం జిల్లా కొత్తపట్నం జడ్పీ హైస్కూల్‌లో 2020 డిసెంబర్‌లో వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది. జిల్లాలోనే అత్యధికంగా 1300 మంది విద్యార్థులున్న ఈ బడిలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మూడేళ్లుగా మొండి గోడలే కనిపిస్తున్నాయి. నిధుల కొరత వల్ల పది అదనపు తరగతి గదుల నిర్మాణాలూ అసంపూర్ణంగానే ఆగిపోయాయి.

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పది తరగతిగదుల నిర్మాణం కూడా నిలిచిపోయాయి. విద్యార్థులను మొండి గోడల మధ్యే కూర్చోబెడుతున్నారు. మరో 10 లక్షల నిధులు మంజూరుచేస్తే గదులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.

Vizianagaram District: విజయనగరం జిల్లాలో పద్ధతి పాడు లేకుండా చేసిన పాఠశాలల విలీన దుస్థితికి నిలువెత్తు నిదర్శనం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోని కొండగండ్రేడు బడి ఉన్నత పాఠశాల విద్యార్థుల్ని సర్దుబాటు చేయడంతో 150మంది విద్యార్థులు వరండాలో, పరదాల మాటున చదువులు నెట్టుకొస్తున్నారు. నూతన భవనాల నిర్మాణం ఇంకా అందుబాటులోకి రాలేదు.

జగనన్న సర్కారులో చదువులంటే విద్యార్థుల్లో గుండెల్లో గుబులే- శిథిలావస్థకు చేరినా పట్టించుకోని పాలకులు

Eluru District: ఏలూరు జిల్లా రాచూరులోని ఎంపీపీ పాఠశాలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 2022లో విలీనం చేశారు. గదుల కొరత కారణంగా ఒక్కో గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలకు రెండు అదనపు తరగతి గదులు మంజూరైనా పునాది దశలోనే పనులు నిలిపేశారు. గతేడాది జూన్‌ వరకు ఇదే పరిస్థితి. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రధానోపాధ్యాయుడుగా వచ్చిన విజయ్‌కుమార్‌ చొరవ తీసుకుని శ్లాబు, గోడలు పూర్తి చేశారు. ఇటీవల ప్రభుత్వం పలు పాఠశాలల్లోని అదనపు తరగతి గదుల నిర్మాణాలను నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలతో పనులు మళ్లీ నిలిచిపోయాయి.

Anantapur District: అనంతపురం జిల్లా కనేకల్ మండలం బ్రహ్మసముద్రంలో ప్రాథమిక పాఠశాలది మరో వింత పరిస్థితి. ఈ బడిలో నాడు-నేడు కింద చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయి. 20 లక్షల వెచ్చించి ఇక్కడ 7గదులను ఆధునికీకరించారు. ఐతే 3నుంచి 5తరగతులను ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోకి విలీనంతో కొత్త గదులు నిరుపయోగంగా మారాయి. ఒకటి అంగన్‌వాడీ కేంద్రం, మరొకటి ప్రధానోపాధ్యాయుడు, ఇంకో రెండింటిని ఒకటి, రెండు తరగతులకు కేటాయించినా మరో 3గదులు పనికిరావడం లేదు.

'నాడు - నేడు' నిధులు స్వాహా - పనులు చేయకుండానే ప్రధానోపాధ్యాయుడి చేతివాటం

అర్థాంతరంగా ఆగిపోయిన పనులు: రాష్ట్ర వ్యాప్తంగా 44వేల 478 పాఠశాలలు ఉంటే మొదటి విడతలో 15వేల 713 బడుల్లో పనులు చేశారు. 2021 ఆగస్టు 16న 16వేల 493 బడుల్లో రెండో విడత పనులు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిధుల్లేవంటూ 6 ఆరు నెలల పాటు పనులు వాయిదా వేసేశారు. 12వేల 272 పాఠశాలల్లో ఇంతవరకూ ఎలాంటి పనులు జరగలేదు. రెండో విడత పనులు మొదట 2022 జులైకు పూర్తి చేస్తామని ఆ తర్వాత 2023 ఫిబ్రవరికి, మళ్లీ డిసెంబరుకు గడువు పెంచుకుంటూ పోతోంది.

తాజాగా ఈ ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బిల్లులు సకాలంలో చెల్లించక తరగతి గదులు, మరుగుదొడ్లకు అవసరమయ్యే తలుపులు, కిటికీలను గుత్తేదార్లు సరఫరా చేయడం లేదు. బెంచీల సరఫరా కూడా మధ్యలోనే నిలిపివేశారు. రెండో విడతలో చేపట్టిన నిర్మాణాలకు 8వేల కోట్లు కావాలని అంచనా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.