ETV Bharat / state

'సిద్ధం' అంటూ భీమిలిలో ఎన్నికల సమర శంఖం పూరించిన సీఎం జగన్ - సీఎం జగన్​

CM Jagan in Bheemili Meeting:రానున్న ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని సీఎం జగన్​ అభివర్ణించారు. సిద్దం పేరుతో విశాఖపట్నం భీమిలో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తాను ఒంటరిగా పోరాడుతానంటూ, అందుకు మీరు సిద్దమా అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్ అంటూ తన పేరును పాలనను పదేపదే ప్రస్తావించిన సీఎం, అంతే స్థాయిలో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 175 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

cm_jagan_in_bheemili_meeting
cm_jagan_in_bheemili_meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 9:32 PM IST

CM Jagan in Bheemili Meeting: రాష్ట్రంలో రానున్న ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి వర్ణించారు. ఈ ఎన్నికలకు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ సిద్ధంగా ఉందని జగన్​ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎత్తులు, జిత్తులు పద్మవ్యూహాలు రచిస్తున్నాయని, వాటికి బలైపోవాడనికి తాను అభిమన్యుడ్ని కాదని అర్జునుడని అన్నారు.

విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని సంగివలసలో 'సిద్ధం' పేరుతో వైఎస్సార్​సీపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్​ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రంలో ఐదు సంవత్సారాలుగా అమలు చేస్తున్న పథకాలే వైఎస్సార్​సీపీకి గెలుపు అస్త్రాలని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని జగన్​ వివరించారు.

జగన్​కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు

రానున్న ఎన్నికల యుద్ధంలో 175 సీట్లలోనూ వైఎస్సార్​సీపీ గెలుపే లక్ష్యమని సీఎం ప్రకటించారు. ప్రతిపక్షాలను కౌవర సైన్యంతో పోల్చిన జగన్‌, పాండవుల సైన్యంగా తమను అభివర్ణించుకున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామన్నారు. వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య జరుగుతున్నయుద్ధమన్నారు.

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లోనే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందన్న విషయాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాలంటీర్లు అందరూ వైఎస్సార్​సీపీకి చెందిన వాళ్లేనని భీమిలి సభ వేదికగా సీఎం స్పష్టం చేశారు.

అమెరికాలో అరెస్ట్ అయింది జగనా అతని కుటుంబ సభ్యులా? లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

పల్లెల్లో ఎక్కడ చూసినా జగన్ మార్కు కనిపిస్తోందని సీఎం అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు తెచ్చామన్నారు. మళ్లీ వైఎస్సార్​సీపీని గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలన్నీరద్దైపోతాయని అన్నారు. తెలుగుదేశం - జనసేన కూటమికి ఓటు వేస్తే తమకు స్కీమ్‌లు వద్దని ఆమోదం తెలిపినట్టేనని జగన్​ హెచ్చరించారు.

బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు అండగా ఉన్నామని జగన్‌ తెలిపారు. చట్టం చేసి మరీ బడుగువర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని ప్రకటించారు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు అనేక పదవుల్లో ఉన్నారని, 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. 80 శాతం ఉద్యోగాలు బలహీనవర్గాలకే ఇచ్చమని అన్నారు. వైఎస్సార్​సీపీ పాలనలో 2.53 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అందించినట్లు జగన్‌ వెల్లడించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని, చేసిన మంచి పనులను ధైర్యంగా చెప్పి ఓట్లు అడుగుతున్నామని సీఎం జగన్‌ అన్నారు.

"విపక్షాలు ఎత్తులు, జిత్తులు పద్మవ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. అర్జునుడు. పేదల జీవితాలు బాగుండాలంటే మళ్లీ వైఎస్సార్​సీపీ కావాలని చెప్పండి. లంచాలు, అవినీతి లేని సుపరిపాలన తెచ్చింది మా ప్రభుత్వమే. పల్లెల్లో ఎక్కడ చూసినా జగన్ మార్కు కనిపిస్తోంది. మళ్లీ వైఎస్సార్​సీపీని గెలిపించుకోకపోతే సంక్షేమ పథకాలన్నీరద్దైపోతాయి." - ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి

పులివెందులలోనూ జగన్​కు ఓటమి భయం- అసంతృప్తి కార్యకర్తలకు భారీగా నగదు పంపిణీ: పత్తిపాటి

ఎన్నికలకు 'సిద్ధం' అవుతున్న వైఎస్సార్​సీపీ - భీమిలిలో బహిరంగ సభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.