ETV Bharat / state

ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే నాయకుడు పవన్: చంద్రబాబు - Chandrababu wishes to Pawan Kalyan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 1:19 PM IST

CM Chandrababu wishes to Deputy CM Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌​ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పవన్​ అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలు చేసుకున్నారు. భారీ కటౌట్​లు, సినిమా పాటలతో కోలాహలంగా కేట్​ కట్టింగ్​ చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

cm_chandrababu_wishes_to_deputy_cm_pawan_kalyan
cm_chandrababu_wishes_to_deputy_cm_pawan_kalyan (ETV Bharat)

CM Chandrababu Best wishes to Deputy CM Pawan Kalyan : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆయన ఆకాంక్షించారు. చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని అన్నారు. ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ నిండు నూరేళ్లూ ఆరోగ్యం, ఆనందాలతో వర్థిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Fans Celebrating Pawan Birthday in Kurnool : కర్నూలులో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును పురస్కరించుకుని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కర్నూలు లోని రాజ్ విహర్ కూడలిలో పవన్‌ కల్యాణ్‌ సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. కర్నూలు జనసేన ఇంచార్జి అర్షద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కర్నూలులో రాజ్ విహార్ ప్రధాన కూడలి కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. ఈ సందర్భంగా జనసైనికులు, అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు.

'ఆ అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు' - పవన్​కు 'అన్నయ్య' స్పెషల్ విషెస్ - Pawan Kalyan Birthday

ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌కు కుప్పం విద్యార్థులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుడుపల్లె మండలానికి చెందిన కళాకారుడు పురుషోత్తం ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 800 మంది విద్యార్థులతో పవన్‌ కల్యాణ్‌ చిత్రపటం ఆకారంలో నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు నిలబడిన వీడియో, శుభాకాంక్షలు తెలుపుతున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో పవన్‌ కల్యాణ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు డిప్యూటీ సీఎంకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పవన్‌ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి : ప్రముఖ నిర్మాణ సంస్థల విజ్ఞప్తి - Pawan Kalyan Birthday Special

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.