CM Chandrababu In NBK Unstoppable Show: నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమా నటుడిగా మరోవైపు ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన మూవీ షూటింగుల్లోనూ పాల్గొంటున్నారు. ఇక సినిమాలే కాకుండా బాలయ్య బాబు ఓటీటీలోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ప్రేక్షకులకు తనలోని మరో యాంగిల్‌ను చూపిస్తున్నారు. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయన గెస్టులతో, ఆడియెన్స్‌తో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 4వ సీజన్‌కు సిద్ధం అవుతోంది.
అక్టోబర్ 24వ తేదీ నుంచి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-4 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు మొదటి ఎపిసోడ్లో గెస్టుగా సీఎం చంద్రబాబు రానున్నట్లు తెలిసింది. ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అక్టోబర్ 20వ తేదీ ఆదివారం నాడు చంద్రబాబు ఈ షూటింగులో పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన ముఖ్యమంత్రికి బాలకృష్ణతోపాటు ఆహా టీం సాదరస్వాగతం పలికింది.
దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు
విడుదలైన అన్ స్టాపబుల్ షో సీజన్-4 ప్రోమో : ఇక గత సీజన్లో చంద్రబాబు, నారా లోకేశ్ అన్‌స్టాపబుల్ షోకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక ఇప్పుడు సీఎం హోదాలో ఆయన ఈ షోలో పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఎపిసోడ్‌కి గెస్టుగా రానున్నట్లు సమాచారం. ఇక గత సీజన్లో ఓ ఎపిసోడ్‌కు వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన్ని కూడా ఈ షోకు గెస్టుగా పిలిచి ఈ ముగ్గురితో మొదటి 2 ఎపిసోడ్లు ప్లాన్ చేయాలని ఆహా టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో బాలయ్య బాబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక తాజాగా ఈ టాక్ షోలో మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కు బాలకృష్ణ కుమార్తె తేజస్విని క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.
"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం
క్విట్ ఇండియా ఉద్యమానికి విజయవాడ లైబ్రరీలో బీజం పడిందా? - మూడుసార్లు సందర్శించిన మహాత్మాగాంధీ