ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు - కృష్ణమ్మ పరవళ్లు చూసి పులకరింత! - CM Watches Prakasam barrage floods - CM WATCHES PRAKASAM BARRAGE FLOODS

CM Chandrababu Watches Prakasam Barrage Flood : విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న చంద్రబాబుకు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వెంటనే ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.

CM Chandrababu Watches Prakasam Barrage Flood
CM Chandrababu Watches Prakasam Barrage Flood (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 8:51 PM IST

CM Chandrababu Watches Prakasam Barrage Flood : విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న చంద్రబాబుకు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వెంటనే ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. వాళ్లతో సెల్ఫీలు దిగారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడడంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు.

పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers

సతీమణికి రెండు చీరలు కొన్న చంద్రబాబు : అంతకుముందే విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. అలాగే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ గత వైఎస్సార్సీపీ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు.

స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు : నెలలో ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ "నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ మాది. బీసీలు ఆది నుంచీ పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం. అలాగే చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్‌ చేస్తాం.

నేతన్నలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తాం. నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తున్నా. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు- ప్రముఖుల స్పెషల్ విషెస్ - National Handloom Day

జగన్​ అక్రమాస్తుల కేసు- సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి: జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా - SC on Jagan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.