AP Cabinet Meeting Today : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Otan Account Budget) కోసం ఆర్డినెన్స్ సహా వేర్వేరు అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం భేటీ అయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ బిల్లుపై కూడా కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.
వివిధ అంశాల చర్చ : మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ (Land Grabbing Prevention Act)ను తీసుకువచ్చే అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాల పైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కొలువుదీరిన క్యాబినెట్- చంద్రబాబుకు కుడి, ఎడమన ఆ ఇద్దరు! - ap cabinet meeting