CM Chandrababu Speech at NTR Cine Vajrotsavam: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తొలి సినిమా మనదేశం 1949లో విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన సినీ నట వజ్రోత్సవాల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘తారకరామం-అన్నగారి అంతరంగం’ శీర్షికతో ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్’ కమిటీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. విజయవాడలోని పోరంకిలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
తెదేపా రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఛైర్మన్‌గా ఉన్న ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్’ కమిటీ ఈ వేడుకల్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద, నిర్మాత డి. సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నందమూరి రామకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలి: క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలి అన్నారు. ఎన్టీఆర్ ప్రతి సినిమా సందేశాత్మకమని అంతే కాకుండా తన సినిమాల ద్వారా జాతికి సందేశం ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్ స్వర, నట విన్యాసం ఆయనకు మాత్రమే సాధ్యమని కొనియాడారు. ఎన్టీఆర్తె లుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటారని అంతే కాకుండా ఆయన వల్ల రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చిందని వెంకయ్యనాయుడు అన్నాడు.
పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఓ అపూర్వ ఘట్టమని స్పష్టం చేశారు. అరుదుగా పుట్టే యుగపురుషుల్లో ఎన్టీఆర్ ఒకరని కొనియడారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొని 'తారక రామం- అన్నగారి అంతరంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. చరిత్ర ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఉండే మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. వెండితెరని, రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. 75 ఏళ్ల క్రితం మనదేశంతో ఎన్టీఆర్ జైత్రయాత్ర ప్రారంభమైందని కొనియాడారు.
ఇప్పుడు ఓ సినిమా తీయటానికి మూడేళ్లు పడుతోంది కానీ ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఏటా 15 సినిమాలు వరకూ తీసేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేవుడిని మనం చూడకపోయినా ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ప్రతీ పాత్రకి న్యాయం చేసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వటం దేశాన్ని గౌరవించుకోవటమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకూ గట్టిగా పోరాడతామని తెలిపారు.
24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లు సొమ్ములు జమ - రైతుల్లో సంతోషం
స్వర్ణాంధ్రప్రదేశ్ మన కల: ఎన్టీఆర్ స్పూర్తితో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. దేశం గర్వించే జాతిగా తెలుగువారు ఎదగటమే ఎన్టీఆర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ 300 చిత్రాల్లో నటించి ప్రతి పాత్రలో జీవించారని సీఎం కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు.
జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం అన్నారు. రాయలసీమలో కరువు, దివిసీమలో తుపాను వచ్చినప్పుడు జోలిపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ మన కల అని అది సాధించే శక్తి మనదగ్గర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
శకపురుషుడు: ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని ఆయన తనయుడు రామకృష్ణ అన్నారు. తెలుగుజాతికి గౌరవం, గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ శకపురుషుడు, కళామతల్లి ముద్దుబిడ్డ అని అన్నారు. నేటితరం నటులకు ఎన్టీఆర్ పాత్రలు నిఘంటువు లాంటివని రామకృష్ణ తెలిపారు.
గుడ్ న్యూస్ : వ్యవసాయ వ్యర్థాలతో విద్యుదుత్పత్తి - పెరగనున్న రైతుల ఆదాయం
ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం