ETV Bharat / state

ఏపీలో నూతన శకం - వాట్సప్ గవర్నెన్స్‌కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం - CM REVIEW ON WHATSAPP GOVERNANCE

వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష - సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు వివరించిన అధికారులు

CM_Review_on_WhatsApp_Governance
CM_Review_on_WhatsApp_Governance (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 7:17 PM IST

Updated : Jan 29, 2025, 8:50 PM IST

CM Chandrababu Review on WhatsApp Governance: ఏపీలో కొంత శకం ప్రారంభం కానుంది. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజల చేతికే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి కావాల్సిందల్లా ఒక్క సెల్​ఫోన్ మాత్రమే. పౌరులకు ఏం కావాలన్న ఫోన్​లోనే ఒక్క క్లిక్​తో ప్రభుత్వ పాలన ఫలాలు అందుబాటులోకి వస్తాయి.

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టనున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్‌తో తొలి విడుతలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్ గవర్నెన్స్​తో ప్రజా జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హైటెక్ సీఎంగా కీర్తి గడించిన చంద్రబాబు రాష్ట్రంలో ఈ విధానంను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా వేగంగా పాలనా ఫలితాలు అందేందుకు ఈ విధానం ఎంతగానే దోహదపడుతుందని వారు తెలిపారు.

వాట్సప్ గవర్నెన్స్ అమలు పై సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులందరు హజరయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయి - మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు: తెలంగాణ మంత్రి

ప్రభుత్వ సమాచారం చేరవేత: ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుంది.

ఉదాహరణలు:

  • భారీవర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం.
  • మీ ప్రాంతంలో విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా ఫలానా సమయంలో విద్యుత్తు సరఫరా ఉండదు.
  • వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి.
  • మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.
  • మీ ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి లాంటి సమాచారాన్ని ఒకేసారి కోట్లమంది ప్రజలకు చేరవేస్తారు.

వినతుల స్వీకరణ, పరిష్కారం: ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఈ నంబరుకు మెసేజ్‌ చేస్తే వెంటనే వారికి ఒక లింక్‌ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పొందుపరిచి వినతిని టైప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరివద్ద ఉందనేది తెలుసుకోవచ్చు. తమ పరిధిలో మురుగు కాలవల లీకేజీలు, రోడ్లు గుంతలు వంటివి ఫొటోలు తీసి పెట్టొచ్చు. వాతావరణ కాలుష్యంపైనా ఫిర్యాదులు చేయొచ్చు.

ప్రభుత్వ పథకాల సమాచారం: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.

పర్యాటక ప్రదేశాల సమాచారం: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. అందులో నుంచి మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్‌ చేసుకోగలరు.

విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపు: విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు పొందొచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు.

పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ - విచారణకు కమిటీ ఏర్పాటు

ఖేల్‌రత్న అవార్డు ఎంపికలో ఆమెను ఎందుకు విస్మరించారు- తప్పు పట్టిన హైకోర్టు

Last Updated : Jan 29, 2025, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.