ETV Bharat / state

మూడు శాఖల పనితీరుపై సీఎం సమీక్ష- ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై దృష్టి - CM Chandrababu Review on Roads

CM Chandrababu Review on Roads: మూడు శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

CM Chandrababu Review on Roads
CM Chandrababu Review on Roads (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 3:16 PM IST

CM Chandrababu Review on Roads: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మూడు శాఖల పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

వైఎస్సార్సీపీ నేతలు మింగిన సొమ్ము రికవరీకి కొత్త చట్టం- సీఎం చంద్రబాబుకు యనమల కీలక సూచనలు - YANAMALA LETTER TO CM

AP Govt White Paper on Amaravati: సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేత పత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.

Minister Payyavula Keshav Review on Finance: మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై పయ్యావుల తుది కసరత్తు చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, వచ్చే ఆదాయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్​శాఖపై రూ. 1.20 లక్షల కోట్ల రుణభారం - వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరే కారణమన్న అధికారులు - Chandrababu Review on Power Sector

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.