ETV Bharat / state

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 100 రోజుల కార్యాచరణ - మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం - CBN REVIEW ON INDUSTRIAL PARKS - CBN REVIEW ON INDUSTRIAL PARKS

CM Chandrababu Review on Industrial Parks: రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమలశాఖ, ఎంఎస్ఎంఈ శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.

Chandrababu Review on Industrial Parks
Chandrababu Review on Industrial Parks (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:47 PM IST

CM Chandrababu Review on Industrial Parks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒక్కొ పార్కు వంద ఎకరాల విస్తీర్ణంలో 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కుల 100 రోజుల కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విజయవాడ మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలని ఆదేశించారు. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు, ఇండస్ట్రీయల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి పరిశ్రమలశాఖ, ఎంఎస్ఎంఇ శాఖలపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతోపాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఇంకా చేసేందుకు అవకాశాలున్న వాటిపై పరిశీలన చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతాల ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - Chandrababu Review Meetings

ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం వివరించారు. రాష్ట్రంలో ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 పార్కులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర అత్యధిక ఇండస్ట్రియల్ పార్కులతో దేశంలో అగ్రస్థానంలో ఉందని, ప్రస్తుతం 53 ఇండస్ట్రియల్ పార్కులు రాష్ట్రంలో ఉన్నాయని రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను పోత్సహించాలన్నారు.

రాష్ట్రంలో పీపీపీ విధానంలో సమీకృత ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సుదీర్ఘ తీర రేఖ కలిగిన ఏపీలో మరిన్ని పోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు, రైలు మార్గాల ద్వారా పోర్టు హింటర్ ల్యాండ్​లను అనుసంధానించాలని అన్నారు. సమీకృత ఓడరేవుల నిర్మాణం జరిగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని చెప్పారు. సమీక్షకు మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ సహా పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ప్రభుత్వ యాప్​లో పేషంట్ పూర్తి వివరాలుండాలి- వైద్య సమీక్షలో సీఎం చంద్రబాబు - Chandrababu Review on Health Dept

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.