ETV Bharat / state

అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం - బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు - CM CBN on Pharma Company Incident - CM CBN ON PHARMA COMPANY INCIDENT

CM Chandrababu Orders Inquiry Into Pharma Company Incident: అనకాపల్లి జిల్లాలోని ఫార్మాకంపెనీలో జరిగిన ప్రమాదంలో16 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గురువారం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు.

cm_cbn_on_pharma_company_incident
cm_cbn_on_pharma_company_incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 10:35 PM IST

CM Chandrababu Orders Inquiry Into Pharma Company Incident: అనకాపల్లి జిల్లాలోని ఫార్మాకంపెనీలో జరిగిన ప్రమాదంలో16 మంది మృతి చెందారు. అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గురువారం అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

ఈ ఘటనపై హెల్త్ సెక్రటరీ, సెక్రటరీ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఫ్యాక్టరీస్, కమిషనర్ లేబర్, డైరెక్టర్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారుతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

అచ్యుతాపురం ఘటనలో 16 మంది మృతి - రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు - Reactor Blast in Pharma Company

Home Minister Anita Responded: అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకమేర్పడిందని తెలిపారు. ఘటనాస్థలిలో కలెక్టర్‌, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఘటనా ప్రాంతంలో సిద్ధంగా ఉంచిన అంబులెన్సులు ఉంచారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది : ఈ ఘటనపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు మృతిచెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటుకు నోటు కేసు: రాజకీయ కక్షలుంటే బయట చూసుకోండి - ఆళ్ల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం - SC ON VOTE FOR NOTE CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.