CM Chandrababu Speech on festivals at TTD and Dasara Celebrations in AP : తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రులను వైభవంగా నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆయన అభినందనలు తెలిపారు. తిరుమలలో ప్రతి సంవత్సరం 450 ఉత్సవాలు జరుగుతాయని సీఎం తెలియజేశారు. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి అని తెలిపారు.
Delighted that the Salakatla Brahmotsavam celebrations at Tirumala Tirupati were conducted successfully and on a grand scale. I commend the @TTDevasthanams for making special arrangements for the comfort and convenience of devotees. Tirumala observes around 450 festivals each… pic.twitter.com/o9WzDPUXXU
— N Chandrababu Naidu (@ncbn) October 12, 2024
ఈ ఏడాది శ్రీవారి మూలవిరాట్ దర్శనానికి దాదాపు 6 లక్షల మంది, వాహన సేవకు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈ ఏడాది 26 లక్షల మందికి అందించారని తెలిపారు. పండుగ విశిష్టత, వైభవాన్ని మెరుగుపరచడానికి అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొనియాడారు. లైట్లతో పాటు ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
తిరుమలలో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు - కన్నులపండువగా స్వామివారి చక్రస్నానం
సంప్రదాయాల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత : దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే విధంగా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. మన పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాల వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. భక్తుల సౌకర్యాలను నిరంతరం మెరుగుపరుస్తూనే ఈ సంప్రదాయాల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
The Dasara Mahotsavam at Kanaka Durga temple at Indrakeeladri in Vijayawada was celebrated with grandeur this year, with arrangements in place for a smooth and spiritually enriching experience for all devotees. Our festivals are more than just celebrations - they form an integral… pic.twitter.com/ipmFINKqqb
— N Chandrababu Naidu (@ncbn) October 12, 2024
వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు