Chandrababu on Amaravati Drone Summit : భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్‌కు అమరావతి వేదిక కానుండటం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబరు 22, 23 తేదీల్లో 5,500 డ్రోన్‌లతో అద్భుతమైన డ్రోన్ షో జరగనుందని చెప్పారు. అమరావతి కేంద్రంగా అతిపెద్ద డ్రోన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ టెక్, ఇన్నోవేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఇది కీలక పరిణామం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.డ్రోన్ నిపుణులతో కలిసి ఈ అతిపెద్ద వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
Delighted that Amaravati is hosting one of India’s largest Drone Summits and Expo on October 22 and 23, with a stunning Drone Show featuring 5,500 drones. This event is a significant step towards positioning Andhra Pradesh as a leader in drone tech and innovation. Looking forward… pic.twitter.com/6mH7GcpiCz
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2024
మరోవైపు అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. డ్రోన్ హ్యక్‌థాన్‌కు యువత భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే 400 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఔత్సాహికుల సౌలభ్యం కోసం నమోదు గడువును మరో రెండ్రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం (17వ తేదీ) వరకు హ్యాక్‌థాన్ పోటీకి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. నగదు బహుమతి కూడా పెంచామని వెల్లడించారు.
Amaravati Drone Summit 2024 : డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా ప్రభుత్వం నియమించింది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం కానుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌కు ఈ సమ్మిట్‌లో రూపకల్పన చేయనున్నారు. మరోవైపు ఈనెల 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5,000ల డ్రోన్లతో విజయవాడలో డ్రోన్ షో నిర్వహించనున్నారు. భారీ డ్రోన్ షోను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు.
సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు సిద్ధం