CM Chandrababu Naidu Wishes Happy Dussehra to Telugu People : దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లేలా చూడాలని కనకదుర్గమ్మ తల్లిని వేడుకున్నట్లు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట…
— N Chandrababu Naidu (@ncbn) October 11, 2024
ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలి : రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారని నారా లోకశ్ అన్నారు. వైఎస్సార్సీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని అన్నారు. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్‌కాన్, హెచ్సీఎల్, టీసీఎల్ తెచ్చుకున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నానని అన్నారు.
తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ,…
— Lokesh Nara (@naralokesh) October 12, 2024
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు : తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని, ప్రజలకు ఎల్లప్పుడు సుఖసంతోషాలు ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు.
సుఖశాంతుల తెలంగాణ
— Revanth Reddy (@revanth_anumula) October 12, 2024
సుభిక్షంగ ఉండాలి…
జన సంక్షేమానికి …
ప్రజా ప్రభుత్వ సంకల్పం
విజయపథాన సాగాలి.
విశ్వ వేదిక పై…
తెలంగాణ సగర్వంగా నిలవాలి.
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. #Dussehra2024 #Dussehra pic.twitter.com/WxlgheY9lo
విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాథ ఏమిటి?
దసరా స్పెషల్ - వెజ్ లవర్స్ కోసం అద్దిరిపోయే "పనీర్ మొఘలాయ్ దమ్ బిర్యానీ" - ఇలా ట్రై చేయండి!