CM Chandrababu Will Start Free Gas Cylinder Scheme : సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ కానుకగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం-2 పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సీఎం పంపిణీ చేయనున్నారు
48 గంటల్లో సొమ్ము ఖాతాలో జమ : దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందించనుంది. మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది.
వంటింట్లో వెలుగుల "దీపం" - ఉచిత గ్యాస్ అమలుపై సర్వత్రా హర్షాతిరేకాలు
నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ, మూడో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ, నాలుగో విడత 2025 డిసెంబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఇచ్చింది
నిధులు విడుదల : ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మొదటి ఉచిత సిలిండర్‌కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లను పెట్రోలియం సంస్థలకు ప్రభుత్వం అందించింది.
"ఫ్రీ గ్యాస్ సిలిండర్" - అర్హులకు నేరుగా బ్యాంకు ఖాతాకే డబ్బులు