ETV Bharat / state

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చర్చ - CBN Review Three Departments

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 10:45 AM IST

Updated : Jul 31, 2024, 2:23 PM IST

CM Chandrababu Review Meetings : రాష్ట్రంలో మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గనులు, ఎక్సైజ్‌, పరిశ్రమల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. మొదట పరిశ్రమల శాఖపై సీఎం, మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు.

Chandrababu Review Three Departments
Chandrababu Review Three Departments (ETV Bharat)

Chandrababu Review Three Departments Today : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనులు, ఎక్సైజ్‌, పరిశ్రమల శాఖలపై కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత పరిశ్రమల శాఖపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు.

Chandrababu Review Industries Department : టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన తర్వాత కూడా వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు కూడా దుర్వినియోగం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఈ క్రమంలోనే కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపై చర్చలు జరుపుతున్నారు.

అనంతరం గనుల శాఖలో చేయాల్సిన ప్రక్షాళనపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు. గత ఐదేళ్లలో ఆ పార్టీ మైనింగ్‌ దందాలపై సర్కార్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎక్సైజ్‌ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. మద్యం విధానంపై అధికారులతో చర్చించనున్నారు. కొత్త మద్యం విధానంపై ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించింది. వాటిపై ఈరోజు సీఎం చర్చిస్తారు. సెప్టెంబర్‌ చివరినాటికి ప్రస్తుత మద్యం విధానం ముగియనుండగా, నూతన లిక్కర్ పాలసీ అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

డోలీ మోతలు కనిపించకూడదు - గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలపై సీఎం సమీక్ష - CM Review on Welfare Issues

రాజముద్రతో భూమి పట్టాదారు పాసు పుస్తకాలు- స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు - CM Review On Revenue Department

Last Updated : Jul 31, 2024, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.