ETV Bharat / state

లోకేశ్​ను భారీ మెజార్టీతో గెలిపించారు - ఇంకా బాగా పని చేయించుకోండి - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - CM Chandrababu on Lokesh - CM CHANDRABABU ON LOKESH

CM Chandrababu on Lokesh : లోకేశ్​పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో లోకేశ్​ మంగళగిరిలో ఓడినా మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారని చెప్పారు. మీ అందరి అభిమానం చూరగొని భారీ మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu Interesting Comments on Lokesh
Chandrababu Interesting Comments on Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 9:40 AM IST

CM Chandrababu Interesting Comments on Lokesh : మంగళగిరిలో లోకేశ్​ గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో లోకేశ్​ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారని చెప్పారు. ప్రజలందరి అభిమానం చూరగొని ఇక్కడి నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీ గెలిపించారన్నారు. ఆయనతో ఇంకా బాగా పని చేయించుకోండి అంటూ ప్రజలతో చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

'గాజువాక, భీమిలిలో మంచి మెజారిటీతో గెలిపించారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజార్టీతో లోకేశ్​ను గెలిపించారు. కుప్పంలో 60 వేల మెజార్టీ వస్తే గొప్ప అనుకునేవాడిని. 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీని గెలిపించారు. మంగళగిరిలో ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ లోకేశ్​కు వచ్చింది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింది : కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీ చేపట్టామని చంద్రబాబు తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశానని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారని మండిపడ్డారు. నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఏపీలో అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదని, పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొల్పారని పేర్కొన్నారు. గత సర్కార్ పాలనలో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతిందని చంద్రబాబు విమర్శించారు.

ఈ సందర్భంగా మంగళగిరి ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేశ్​ నివేదించారు. ప్రజా సంక్షేమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తికి మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని తెలిపారు. అమరావతి నిర్మాణంలోనూ అండంగా ఉంటారని పేర్కొన్నారు. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ఐదేళ్లు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రి చూస్తున్నామని లోకేశ్ వ్యాఖ్యానించారు.

సంపద సృష్టిస్తాం - పెంచిన ఆదాయం పంచుతాం: సీఎం చంద్రబాబు - CBN STARTED PENSIONS DISTRIBUTION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.